
మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడి సినిమా పెద్ద హిట్ అందించింది. దాంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ మరోసారి తన నటనతో ప్రేక్షకులను అకట్టిపడేశారు. తండ్రి కూతురు మధ్య ఉన్న బాండింగ్ గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.
ఇరుముడి సినిమాకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డులతో నిండిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఊహించని వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా పై టీచర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టిస్తుండగా ఇప్పుడు ఊహించని వివాదం చుట్టుముట్టింది. సినిమాలో కొన్ని సీన్స్ తొలగించాలని టీచర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను సినిమాలో చూపించారని.. ఆ సన్నివేశాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని టీచర్స్ డిమాండ్ చేస్తున్నారు. సీలేరు జడ్పీ హైస్కూల్ పేరుతో పాటు ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్‌ను చూపిస్తూ ఉపాధ్యాయురాలి పాత్రను నెగెటివ్‌గా చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సినిమాలో ఆ సీన్స్ ను వెంటనే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమాలో ప్రభుత్వ పాఠశాల టీచర్ పాత్రను సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చూపించారని ఉపాధ్యాయ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.