Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?

|

Mar 17, 2022 | 9:50 PM

ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. దీంతో సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది మూవీ టీం.

Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?
Rrr In Andhra Pradesh
Follow us on

RRR: ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్‌ ఇండియా మూవీ ట్రిపులార్‌కు సంబంధించి, టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో స్పష్టత వచ్చింది. ఈ సినిమా నిర్మాణం గురించి, మరో అప్డేట్‌ను ప్రభుత్వానికి ఇచ్చింది చిత్ర బృందం. జీఎస్టీ కాకుండా ఈ సినిమా ఖర్చును 336 కోట్ల రూపాయలుగా తెలిపిన నిర్మాతలు, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్‌తో కలిపి అది 478 కోట్ల రూపాయలకు పెరిగిందని వివరించారు. సినిమా బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి లెక్కలు అందడంతో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాకు టిక్కెట్ల పెంపు విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఈనెల 25 నుంచి పదిరోజుల పాటు సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతించింది. అన్ని కాసుల్లో 75 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది మూవీ టీం. రామ్ చ‌ర‌ణ్(Ram Charan), ఎన్టీఆర్(Jr NTR), రాజ‌మౌళి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూ లు ఇస్తూ, సినిమాను ప్రమోట్ చేస్తోంది చిత్ర బృందం. రాజ‌మౌళి సినిమా తీయ‌డంపై ఎంత ఇంట్రెస్ట్‌ పెడతారో, ప్రమోషన్స్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ఈ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ చేయడానికి దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యట‌న చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్, చరణ్, జక్కన్న. ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వ‌ర‌కు దేశం మొత్తం చుట్టి రానున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా రాజ‌మౌళి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ దుబాయ్ వెళ్లనున్నారు. ఇక 19న బెంగుళూరులో పర్యటించనునుంది ఆర్ఆర్ఆర్ మూవీ టీం. చిక్బల్లాపూర్‌లో నిర్వహించే ప్రీరీలిజ్ ఈవెంటో పాల్గొననున్నారు చరణ్, ఎన్టీఆర్, రాజమొళి. అలాగే మార్చి 20న బరోడాతో పాటు ఢిల్లీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి పర్యటిస్తారు. అనంత‌రం మార్చి 21న అమృతసర్, జైపూర్‌లో మూవీ ప్రమోషన్‌ ప్రోగ్రాంలో పాల్గొననున్నారు. మార్చి 22న కోల్ కతా, వారణాసిలో ప‌ర్యటించనుంచి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం. మార్చి 23న హైదరాబాద్‌కు రానున్నారు హీరోలు, డైరెక్టర్. ఈ టూర్ సినిమా క‌లెక్షన్లు పెర‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తోంది చిత్ర బృందం.

ఇక RRR సినిమా టికెట్ రేట్లు ఏపీలో ఏయే ప్రాంతాలలో ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…

 కార్పొరేష‌న్స్‌..
సింగిల్ స్క్రీన్స్ – రూ.236,
మ‌ల్టీప్లెక్స్ – రూ.265

మున్సిపాలిటీస్‌..
సింగిల్ స్క్రీన్స్ – రూ.206,
మ‌ల్టీప్లెక్స్ -రూ. 236

ఇత‌ర ప్రాంతాల విష‌యానికి వ‌స్తే…
సింగిల్ స్క్రీన్స్ -రూ. 195,
మ‌ల్టీప్లెక్స్ -రూ. 206

Also Read: Guava Leaf: జామ ఆకుతో కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? అమ్మో..! అస్సలు గెస్ చేయలేం