కోహ్లీ- అనుష్క జోడి కలిసున్నది 21రోజులేన‌ట‌..!

స‌హ‌జంగా సినిమా సెల‌బ్రిటీలు, క్రీడాకారులు ఊపిరి స‌ల‌ప‌ని షెడ్యూల్స్ తో బిజీగా ఉంటారు. వారికి కుటుంబంతో స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం అరుదుగా వ‌స్తుంటుంది. స‌మ‌యం ఇవ్వక‌పోవ‌డంతో వారి భాగ‌స్వాములు నుంచి చాలా సార్లు ఫిర్యాదులు కూడా వ‌స్తాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 7:55 am, Fri, 3 July 20
కోహ్లీ- అనుష్క జోడి కలిసున్నది 21రోజులేన‌ట‌..!

స‌హ‌జంగా సినిమా సెల‌బ్రిటీలు, క్రీడాకారులు ఊపిరి స‌ల‌ప‌ని షెడ్యూల్స్ తో బిజీగా ఉంటారు. వారికి కుటుంబంతో స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం అరుదుగా వ‌స్తుంటుంది. స‌మ‌యం ఇవ్వక‌పోవ‌డంతో వారి భాగ‌స్వాములు నుంచి చాలా సార్లు ఫిర్యాదులు కూడా వ‌స్తాయి. ఇది ఇంట్లో ఒక సెల‌బ్రిటీ ఉంటే జ‌రిగేది. అదే ఒక‌ ఇంట్లో ఆలుమ‌గ‌లు ఇద్ద‌రూ సెల‌బ్రిటీలే అయితే..?. ఒక‌రు క్రీడారంగంలో, మ‌రొక‌రు సినిమా రంగంలో రాణిస్తుంటే..?. హా..అవును మేము మాట్లాడుతుంది అనుష్క శ‌ర్మ‌-కోహ్లీ జోడి గురించే. ఈ విష‌యం గురించే ఇటీవ‌ల మాట్లాడిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ..​ తన పెళ్లి జరిగిన తర్వాత తొలినాళ్లలో సంఘటనల్ని పంచుకుంది.

త‌మ‌ ఇద్దరికి వృత్తులు ఒక‌దానికొక‌టి పొంత‌న లేక‌పోవ‌డంతో..కల‌వ‌డానికి పెద్ద‌గా టైమ్ దొర‌కేది కాద‌ని తెలిపింది అనుష్క‌. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కలిసి భోజనం చేసేందుకు వెళ్లేవాళ్లమ‌ని పేర్కొంది. ఇలా తాము పెళ్లి జరిగిన మొదటి ఆరునెలల్లో కేవలం 21 రోజులు మాత్రమే కలిసున్నామంటూ షాకింగ్ విష‌యం రివీల్ చేసింది. అయితే ఆ 21 రోజులు త‌న‌కెంతో ఇష్ట‌మైన‌వి, అమూల్యమైనవని పేర్కొంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌కు వ‌ల్ల‌ కావాల్సినంత సమయాన్ని కలిసి ఎంజాయ్ చేస్తున్నామ‌ని అనుష్కశర్మ వెల్ల‌డించింది.