
అందాల భామ సోషల్ మీడియా అకౌంట్స్ ను నెటిజన్స్ ఎప్పటికప్పుడు తిరగేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ చిన్న ఫోటో పెట్టిన వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక మన ముద్దుగుమ్మలు కూడా అభిమానులు ఏమాత్రం నిరాశపడకుండా.. తమ గ్లామరస్ ఫోటోలను రకరకాల ఫోజుల్లో షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఓ వైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతునే మరో వైపు ఇలా తన క్యూట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. అంతకు ముందు వచ్చిన స్కంద సినిమా అటు ఇటు అయినా కూడా ఆ ఎఫెక్ట్ ఈ చిన్నదాని పైన పడలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తోంది. అలాగే యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది శ్రీలీల.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.