Anupama Parameswaran: తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అనుపమ.. అత్తమ్మా అంటూ నెటిజన్స్ కామెంట్స్..

|

Apr 04, 2024 | 2:39 PM

అచ్చంగా తెలుగమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించే అనుపమ ఈ మూవీలో లిల్లీ పాత్రలో గ్లామర్ హద్దులు చేరిపేసింది. ఫ్యాన్స్ ఏమాత్రం ఊహించని రేంజ్‏లో కనిపించి షాకిచ్చింది. సిద్ధూ జొన్నలగడ్డ సరసన లిల్లీ పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీతో అనుపమ మరో టాలెంట్ చూసి పొగడ్తలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. టిల్లుతో లిల్లి జోడిగా సూపర్ అంటూ అనుపమ నటనకు మరోసారి ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. అనుపమ ఏ పోస్ట్ చేసినా యూత్ క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు.

Anupama Parameswaran: తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అనుపమ.. అత్తమ్మా అంటూ నెటిజన్స్ కామెంట్స్..
Anupama
Follow us on

తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత అనుపమ పరమేశ్వరన్. అఆ సినిమాతో టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చిన ఈ కేరళకుట్టికి అతి తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన అనుపమ ఇన్నాళ్లు ఒకేతీరు పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంది. కానీ టిల్లు స్క్వేర్ సినిమాతో రూటు మార్చింది. అచ్చంగా తెలుగమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించే అనుపమ ఈ మూవీలో లిల్లీ పాత్రలో గ్లామర్ హద్దులు చేరిపేసింది. ఫ్యాన్స్ ఏమాత్రం ఊహించని రేంజ్‏లో కనిపించి షాకిచ్చింది. సిద్ధూ జొన్నలగడ్డ సరసన లిల్లీ పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీతో అనుపమ మరో టాలెంట్ చూసి పొగడ్తలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. టిల్లుతో లిల్లి జోడిగా సూపర్ అంటూ అనుపమ నటనకు మరోసారి ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. అనుపమ ఏ పోస్ట్ చేసినా యూత్ క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు.

ఇటీవల తన తమ్ముడిని హగ్ చేసుకున్న ఫోటోస్ షేర్ చేయగా.. బామ్మర్ది… మీ అక్క జాగ్రత్తగా అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు తన తల్లికి బర్త్ డే విషెష్ తెలుపుతూ తల్లి సునీతతో కలిసి ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. ఇక అనుపమ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అత్తమ్మా.. హ్యాపీ బర్త్ డే.. పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తగారూ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తుండగా.. ఇద్దరూ అక్కా చెల్లెల్లుగా కనిపిస్తున్నారంటున్నారు. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అనుపమ తల్లి పేరు సునీత పరమేశ్వరన్. కూతురు మాదిరిగానే ఆమె కూడా నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో జన్మించిన అనుపమ.. ఇంటర్ వరకు చదివి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 19 ఏళ్ల వయసులోనే ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వెంటవెంటనే తెలుగులో ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది అనుపమ. మార్చి 29న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే దాదాపు రూ. 85 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.