Dj Tillu: ఎట్టకేలకు డీజే టిల్లు 2కు జోడి దొరికేసింది.. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

|

Jan 11, 2023 | 2:47 PM

ఇప్పటికే ఈ సీక్వెల్ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేయగా.. ఇందులో కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. అయితే అనుకోకుండా ఈ చిత్రం నుంచి అనుపమ తప్పుకుందని.. దీంతో మడోన్నా సెబస్టియన్ నటిస్తున్నట్లుగా ప్రకటించారు.

Dj Tillu: ఎట్టకేలకు డీజే టిల్లు 2కు జోడి దొరికేసింది.. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..
Dj Tillu
Follow us on

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకున్న చిత్రాల్లో డీజే టిల్లు ఒకటి. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమా 2020లో విడుదలైన మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సీక్వెల్ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేయగా.. ఇందులో కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. అయితే అనుకోకుండా ఈ చిత్రం నుంచి అనుపమ తప్పుకుందని.. దీంతో మడోన్నా సెబస్టియన్ నటిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక మడోన్నా కూడా తప్పుకోవడంతో కథనాయిక కోసం డీజె టిల్లు సెర్చింగ్ స్టార్ చేశాడని తెలిసింది. అయితే ఈ సినిమా నుంచి హీరోయిన్స్ తప్పుకోవడంపై సరైన కారణాలు తెలియలేదు. తాజాగా డీజె టిల్లు స్వ్కేర్ కు జోడి దొరికేసింది.

తాజాగా అనుపమ విడుదల చేసిన వీడియోతో డీజె టిల్లు ఎవరనేదానిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టిన ఆమె.. హీరో సిద్ధు జొన్నలగడ్డ జుత్తుకు జెల్ రాస్తూ కనిపించింది. ఇది నా ప్రత్యామ్నాయ వృత్తి అంటూ సంబంధిత వీడియోను అనుపమ షేర్ చేసింది. డిజె టిల్లు కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. దాని సిక్వెల్ కు రామ్ మల్లిక్ డైరెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గతేడాది అనుపమ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. కార్తీకేయ 2 చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాందిచుకుంది. ఇందులో అనుపమ, నిఖిల్ నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇటీవల వీరిద్దరి కాంబోలో వచ్చిన 18 పేజీస్ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఓటీటీలో విడుదైలన బటర్ ఫ్లై సినిమాలోనూ లీడ్ రోల్ పోషించింది.

అనుపమ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.