Anupama Parameswaran: ఆ వెబ్‏సైట్‏కు అనుపమ చురకలు.. సారీ చెప్పిన వదలని కేరళ కుట్టి..

యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో అనుపమ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఫిబ్రవరి 16న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఈ మూవీకి వచ్చిన ఓ రివ్యూ పై అనుపమ పరమేశ్వరన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ చురకలు అంటించింది.

Anupama Parameswaran: ఆ వెబ్‏సైట్‏కు అనుపమ చురకలు.. సారీ చెప్పిన వదలని కేరళ కుట్టి..
Anupama Parameswaran

Updated on: Feb 23, 2024 | 4:41 PM

ప్రస్తుతం వరుస సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే ఈగల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. మాస్ మాహారాజా రవితేజ నటించిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో టిల్లు స్వ్కేర్ ఒకటి. ఇక తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. కోలీవుడ్ హీరో జయం రవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైరన్ సినిమాలో అనుపమ నటించింది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో అనుపమ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఫిబ్రవరి 16న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఈ మూవీకి వచ్చిన ఓ రివ్యూ పై అనుపమ పరమేశ్వరన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ చురకలు అంటించింది.

అసలేం జరిగిందంటే.. ఓ ప్రముఖ వెబ్ సైట్ సైరన్ సినిమా గురించి రివ్యూ రాసింది. అందులో ఒక్కో పాత్ర గురించి రాసుకొచ్చింది. అయితే ఈ మూవీలో అనుపమ పాత్ర కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉందని.. అంతేకాకుండా ఆమెకు ఎలాంటి డైలాగ్స్ కూడా లేవంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అనుపమ.. తన పాత్ర గురించి రాసిన లైన్స్ పై రియాక్ట్ అవుతూ.. “మాటలు రాని ఓ అమ్మాయి పాత్రకు డైలాగ్స్ లేవు అని రాసిన మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను” అంటూ చురకలు అంటిస్తూ సదరు వెబ్ సైట్ కు మెసేజ్ చేసింది.

దీంతో ఆ వెబ్ సైట్ అనుపమకు క్షమాపణలు చెబుతూ.. సదరు రివ్యూను ఎడిట్ చేయిస్తామని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది అనుపమ. ‘మీరు ఎలాంటి ఆర్టికల్స్ రాస్తున్నారు.. ఎలాంటి నిరాధరమైన ఆర్టికల్స్ రాస్తున్నారో ప్రజలకు తెలియాలి కదా ? ‘అంటూ షేర్ చేసింది అనుపమ. ప్రస్తుతం ఈ కేరళ కుట్టి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అనుపమకు మద్దతు తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. అనుపమ నటిస్తోన్న టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజ్ కాబోతుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.