మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. పెద్ద కళ్లతో.. ఉంగరాల జుట్టుతో మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ మూవీతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయింది. ఇక్కడే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అడియన్స్ మనసులు గెలిచినా.. ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. చివరగా కార్తీకేయ 2, 18 పేజీస్ చిత్రాల్లో కనిపించింది. ఇక ఇటీవలే ఈగల్ సినిమాతో మరోసారి అభిమానులను పలకరించింది. అనుపమకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆమెకు సెపరేట్ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం మలయాళీ ముద్దుగుమ్మ అభిమానులు తెగ హర్ట్ అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ చేస్తోన్న పని చూస్తుంటే బ్రేకప్ కంటే ఎక్కువగా బాధ కలుగుతుందంటూ నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి మాత్రం అనుపమను ప్రశ్నిస్తూ ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ఇంతకీ ఫ్యాన్స్ అంతగా హర్ట్ అయ్యేలా ఏం చేసిందో తెలుసుకుందామా ?
కొన్నాళ్లుగా ఈ కేరళ కుట్టి రూటు మార్చేసింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ గా కనిపించే అనుపమ ఇప్పుడు హద్దులు చెరిపేసింది. రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ కిస్సులతో షాకిచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాలో మరింత రెచ్చిపోయింది. గ్లామర్ షో.. హగ్గులు, కిస్సులు అంటూ నానా హంగామా చేస్తుంది. ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. ఈ మూవీలో మునుపెన్నడు కనిపించని కొత్త అనుపమ కనిపించనుందని అర్థమవుతుంది. ఇక సినిమా వరకు ఓకే.. కానీ ఇటీవల తన ఇన్ స్టాలోనూ గ్లామర్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అనుపమ ఫోటోస్, వీడియోస్ పై అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు ఓ అభిమాని అనుపమ తీరు తనకు నచ్చడం లేదంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అలనాటి హీరోయిన్స్ సావిత్రి, సౌందర్యలతో పోలుస్తూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
“మీ ఫోటో నా ఆటోలో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి.. ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి.. ప్రేమమ్, అఆ, శతమానం భవతి సినిమాలు చేసిన మీరు.. ఇప్పుడు రౌడీబాయ్స్, టిల్లు స్క్వేర్ సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు సావిత్రి గారు, సౌందర్యగారిలానే సినిమాలు చేస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం మాకేం నచ్చడం లేదండి” అంటూ చెప్పుకొచ్చాడు.
• #TilluSquare ట్రైలర్ చూసి గుండె పగిలిన @anupamahere అభిమాని, తన బాధ చెప్పుకున్నాడు.#AnupamaParameswaran #HBDAnupamaParameswaran#HappyBirthdayAnupamapic.twitter.com/fucNWjDYtA
— Cinepedia (@TheCinepedia) February 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.