Bheemla Nayak: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. భీమ్లా నాయక్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసింది…

|

Oct 15, 2021 | 1:16 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలో పవర్ స్టార్‏కు భారీగా క్రేజ్

Bheemla Nayak: పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. భీమ్లా నాయక్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసింది...
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలో పవర్ స్టార్‏కు భారీగా క్రేజ్ ఉంది. పవన్ అభిమానులు నెట్టింట్లో చేసే రచ్చ గురించి తెలిసిన విషయమే. ఇటీవల వకీల్ సాబ్ సినిమాకు ఆయన అభిమానులు చేసిన రచ్చ మాములుగా లేదు. ఇక పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్‌హిట్‌గా మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ ఇది. ఇందులో రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఇప్పటికే భీమ్లా నాయక్ తొలి సింగిల్, టీజర్, రానా పాత్ర డానియల్ శేఖర్ టీజర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇందులో పవన్ భార్యగా నిత్యామీనన్ నటిస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం.. భీమ్లా నాయక్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్.. అంత ఇష్టం అనే పాటను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా దసరా కానుకగా.. అక్టోబర్ 15న శుక్రవారం ఈ అంత ఇష్టం ఏందయ్యా.. అనే పూర్తి పాటను విడుదల చేశారు చిత్రయూనిట్.. అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాట సీని ప్రియులకు బాగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటను సింగర్‌ చిత్ర ఆలపించారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వీడియో..

Also Read:

Apple Side Effects: యాపిల్స్ ఎక్కువగా తింటున్నారా ?… అయితే జాగ్రత్త.. ప్రమాదం మీ చెంతనే..

APJ Kalam Birth Anniversary 2021: దేశ ప్ర‌జ‌ల‌కు అబ్దుల్ క‌లాం స్ఫూర్తి.. మిస్సైల్ మ్యాన్‌ను గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ..

Hyderabad: భాగ్యనగరంలో 17 రోజులపాటు వర్షం కురిస్తే.. ఏమవుతుందో తెలుసా..? షాకిస్తున్న బిట్స్ పిలానీ అధ్యయనం