Anjali: శ్రీలీలతో పోలిక.. ఇచ్చిపడేసిన అంజలి.. ఆన్సర్ వింటే మతిపోవాల్సిందే.!

అంజలి అందుకున్న సూపర్ హిట్ సినిమాల్లో గీతాంజలి ఒకటి. 2014లో విడుదలైన గీతాంజలి సినిమా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. కొరియోగ్రాఫర్‌ శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో శివ నిన్ను కోరి సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక ఇప్పుడు గీతాంజలి 2 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Anjali: శ్రీలీలతో పోలిక.. ఇచ్చిపడేసిన అంజలి.. ఆన్సర్ వింటే మతిపోవాల్సిందే.!
Anjali
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2024 | 5:59 PM

తెలుగమ్మాయి అంజలి సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. అంజలి తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంజలి అందుకున్న సూపర్ హిట్ సినిమాల్లో గీతాంజలి ఒకటి. 2014లో విడుదలైన గీతాంజలి సినిమా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. కొరియోగ్రాఫర్‌ శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో శివ నిన్ను కోరి సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక ఇప్పుడు గీతాంజలి 2 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అంజలి కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది.

ఓ లేడీ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ‘తెలుగువారికి మీరంటే చాలా అభిమానం. నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ ని కానీ మీకు తెలుగులో సరైన బ్రేక్ మాత్రం రాలేదు.. తెలుగుఅమ్మాయి అవ్వడం వల్లే మీకు బ్రేక్ రాలేదా.?లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.? అని ప్రశ్నించింది. దాంతో అంజలీ స్పందిస్తూ.. నాకు బ్రేక్ రాకపోతే నేను మీ ఫెవరెట్ హీరోయిన్ ను అయ్యేదాన్నే కాదు అని చెప్పింది. ఇంతలో మరో ప్రశ్న అడిగింది సదరు జర్నలిస్ట్..

ఈ రోజు శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తోంది. మీరేమో.. అని ప్రశ్న అడగబోయింది ఆ జర్నలిస్ట్.. దాంతో అంజలి మధ్యలో మాట్లాడుతూ.. నేనెప్పుడూ ఫస్ట్ , సెకండ్ ప్లేస్ కోసం పోటీపడలేదు. ఒక్కొక్కరికి ఒక్కో హీరోయిన్‌ నచ్చుతారు అని చెప్పింది. అలాగే నాకు స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తాను.. నన్ను నేను నిరూపించుకునే పాత్ర దొరికితే సినిమా చేస్తా.. నేను కూడా ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చెయ్యచ్చు కానీ వాటికంటే ఒక్క మంచి సినిమాచేయడం నాకు ఇష్టం. నేను తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఇక్కడొకటి.. అక్కడొకటి చేస్తున్నా .. నాకు కిక్ ఇచ్చే పాత్రలే చేస్తున్నా అని చెప్పుకొచ్చింది అంజలి.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు