Animal: దుమ్మురేపిన రణబీర్ కపూర్ యానిమల్ టీజర్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం

రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కొంచం పర్లేదు అనిపించుకుంది. అలాగే షారుఖ్ నటించిన పఠాన్ సినిమా కూడా హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ ఊపందుకుంది. రీసెంట్ గా జవాన్ సినిమాతో సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ ప్రేక్షకులంతా ఇప్పుడు యానిమల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకున్న సందీప్. బాలీవుడ్ లో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు.

Animal: దుమ్మురేపిన రణబీర్ కపూర్ యానిమల్ టీజర్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం
Animal

Updated on: Sep 28, 2023 | 12:19 PM

బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ వరుసగా ఫ్లాప్ లతో సతమతం అయ్యింది.  స్టార్ హీరోల సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అదే సమయంలో రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కొంచం పర్లేదు అనిపించుకుంది. అలాగే షారుఖ్ నటించిన పఠాన్ సినిమా కూడా హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ ఊపందుకుంది. రీసెంట్ గా జవాన్ సినిమాతో సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ ప్రేక్షకులంతా ఇప్పుడు యానిమల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకున్న సందీప్. బాలీవుడ్ లో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో సినిమాచేస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను విడుదల చేశారు. యానిమల్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

 రణబీర్ కపూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.