8 నెలల ప్రెగ్నెన్సీ‌తో కూడా యాంకరింగ్.. ఈ స్టార్ యాంకర్ డెడికేషన్‌కు సలాం చేయాల్సిందే

బుల్లితెరపై ఆమె కనిపిస్తేనే ప్రేక్షకులు అల్లరితో అరుపులు కేకలు వేస్తూ ఉంటారు. కొన్నేళ్లుగా ఆమె ఓ స్టార్ యాంకర్.. తన మాటలతో ఎన్నో షోలను సక్సెస్ ఫుల్ గా చేసి రాణించారు. అలాగే ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు ఆమె..

8 నెలల ప్రెగ్నెన్సీ‌తో కూడా యాంకరింగ్.. ఈ స్టార్ యాంకర్ డెడికేషన్‌కు సలాం చేయాల్సిందే
Telugu Anchor

Updated on: Nov 08, 2025 | 4:00 PM

సినిమా హీరోయిన్స్, సీరియల్ యాక్టర్స్ మాత్రమే కాదు.. యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంటారు. ఇప్పటికే ఎంతో మంది యాంకర్ మంచి గుర్తుంపు తెచ్చుకుంటున్నారు. కేవలం టీవీ షోలతోనే కాదు.. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది యాంకర్ అభిమానులను అలరిస్తున్నారు. కొంతమంది గ్లామర్ తో ఆకట్టుకుంటుంటే.. మరికొంతమంది తమ టాలెంట్ తో, అనర్గళమైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో మనం మాట్లాడుకుంటున్న యాంకర్ ఒకరు. ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. టాప్ యాంకర్ గా ఇప్పటికీ రాణిస్తుంది ఆమె.. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తాను యాంకర్ గా చేశాను అని తెలిపింది. ఆ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను అని తెలిపారు. ఇంతకూ ఆమె ఎవరంటే..

బుల్లితెర యాంకర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ కనకాల. కొన్నేళ్లుగా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంటూ టాప్ యాంకర్‎గా దూసుకుపోతుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా.. టీవీ షోస్ అయిన సుమ కచ్చితంగా ఉండాల్సిందే. పంచులు, ప్రాసలతో ఆడియన్స్‏ను నవ్విస్తూ వినోదాన్ని అందించడంలో సుమ స్టైలే వేరు.. అంతేకాకుండా.. చిన్న సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకు ప్రతి మూవీ మేకర్స్‏ను సుమ ఇంటర్వ్యూ చేసేస్తుంది. కెరీర్ ప్రారంభంలో నటిగా ఉన్నా సుమ.. ఆ తర్వాత యాంకర్‏గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ టీవీ షోస్, ఈవెంట్స్ అంటూ బిజీ షెడ్యూల్ గడిపే సుమ కనకాల.. చాలా కాలంగా వెండితెరపై కనిపించలేదు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు సుమ.

తాజాగా సుమ ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఆ షోలో ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే తాను ప్రగ్నెన్సీ సమయంలోనూ యాంకర్ గా ప్రీ రిలీజ్ షో చేశాను అని చెప్పారు సుమ. ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమా ప్రీ రిలీజ్ సమయంలో.. నేను ఎనిమిది నెలల గర్భవతిని.. ఈవెంట్ అయిపొయింది. ఎన్టీఆర్ సినిమా కావడంతో జనాలు చాలా మంది వచ్చారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్లే డోర్ ను మూసేశారు.. నేను డోర్ ముందు ఉన్నాను.. నా భర్త రాజీవ్ కూడా నాతోనే ఉన్నాడు. ఒక్కసారిగా జనం రావడం మొదలుపెట్టారు. అటు నుంచే బయటకు వెళ్ళాలి.. అందరూ వచ్చి మీదపడబోయారు.. రాజీవ్ నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఇద్దరం అరుస్తున్నాం డోర్ తీయండి అని.. కరెక్ట్ గా జనాలు మమల్ని చేరుకునే లోగా డోర్ తీశారు. దాంతో ఊపిరి పీల్చుకున్నా.. అని అన్నారు. అలాగే ఒక గవర్నమెంట్ ఈవెంట్ కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హోస్ట్ చేశాను. ఈ ఈవెంట్ ఎల్బీ స్టేడియం లో జరిగింది. జనాలు ఎక్కువగా రావడంతో కార్లను రవీద్రభారతి దగ్గరే ఆపేశారు. దాంతో ఏడునెలల కడుపుతో నేను అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం వరకు నడుచుకుంటూ వెళ్లాను.. నాకోసమే అక్కడు జనాలు ఎదురుచూస్తున్నారు. అప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను అని చెప్పుకొచ్చారు సుమ. ఈ కామెంట్స్  ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి