Suma Kanakala : సుమ చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి మీకు తెలుసా.. ఆ పేరు ఎవరిదంటే..

బుల్లితెరపై తన వాయిస్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు సుమ కనకాల. హోస్ట్ గా వందల షోస్ లో ఆకట్టుకున్న సుమ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

Suma Kanakala : సుమ చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి మీకు తెలుసా.. ఆ పేరు ఎవరిదంటే..
Suma

Updated on: May 04, 2022 | 5:12 PM

బుల్లితెరపై తన వాయిస్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు సుమ కనకాల(Suma Kanakala). హోస్ట్ గా వందల షోస్ లో ఆకట్టుకున్న సుమ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడెప్పుడో వర్షం సినిమాలో ప్రభాస్ కు అక్కగా కనిపించిన సుమ.. ఇప్పుడు జయమ్మ పంచాయితీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. మే 6న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంట్రవ్యులు ఇస్తూ బిజీగా ఉన్నారు సుమ. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంట్రవ్యూలో సుమ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే ఇటీవల సుమ చేతిపైన ఒక పేరు పచ్చబొట్టు కనిపిస్తుంది.  ఇంతకు ఆ పచ్చబొట్టు కథ ఏంటి..?

అయితే ఇంట్రవ్యూలో సుమ ఈ పచ్చబొట్టు గురించి అసలు విషయం చెప్పుకొచ్చారు. తన చేతిపైన వెంకన్న అనే పేరు పచ్చబొట్టు ఉంది. వెంకన్న ఎవరు అనే విషయాన్నీ రివీల్ చేశారు సుమ. నా చేతి పైన ఉన్న పచ్చబొట్టు గురించి తెలియాలంటే జయమ్మ పంచాయితీ చూడాల్సిందే.. అంటున్నారు సుమ. విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న జయమ్మ పంచాయితీ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ చిత్ర ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో జయమ్మగా సుమ తన నటనతో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Beast OTT: ఓటీటీలోకి ‘బీస్ట్‌’ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే.. అధికారిక ప్రకటన..

Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..

Follow Us