Saaho: మూవీ అదిరిపోయింది.. కామన్ సెన్స్‌ లేని వారి రివ్యూస్ పట్టించుకోవద్దు

|

Aug 31, 2019 | 6:46 PM

శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ సినిమాకి ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా అస్సలు బాలేదంటూ కొందరు కావాలని నెగటీవ్ ప్రచారం చేయడంపై ఫేమస్ యాంకర్ రవి మండపడ్డాడు. తెలుగులో హాలివుడ్ స్థాయి సినిమా వస్తే..అస్సలు చూడకుండా రివ్యూలు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. సినిమా తీయడం అంత సులువు కాదని.. అలాంటిది నెగెటివ్ రివ్యూలతో సినిమాను చంపేస్తున్నరంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వేదికగా తన […]

Saaho: మూవీ అదిరిపోయింది.. కామన్ సెన్స్‌ లేని వారి రివ్యూస్ పట్టించుకోవద్దు
Sahoo Movie Negative Reviews
Follow us on

శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ సినిమాకి ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా అస్సలు బాలేదంటూ కొందరు కావాలని నెగటీవ్ ప్రచారం చేయడంపై ఫేమస్ యాంకర్ రవి మండపడ్డాడు. తెలుగులో హాలివుడ్ స్థాయి సినిమా వస్తే..అస్సలు చూడకుండా రివ్యూలు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. సినిమా తీయడం అంత సులువు కాదని.. అలాంటిది నెగెటివ్ రివ్యూలతో సినిమాను చంపేస్తున్నరంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. రూ.350 కోట్లు పెట్టి సినిమా తీయడం మామూలు విషయం కాదని..  తనకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందని.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమాను రూపొందించారని చెప్పారు. ఈ మధ్య కాలంలో రియాక్ట్ అవ్వడం మానేశానని.. కానీ ఈ సినిమా గురించి వీడియో పెట్టాలనిపించిందని రవి సాహో సినిమాపై మన అభిప్రాయన్ని పంచుకున్నాడు.

”నేను సెలూన్ కి వచ్చా.. అక్కడ చాలా మంది సినిమా బాగుందని అంటుంటే.. ఒక అబ్బాయి మాత్రం సినిమా బాలేదని చెప్పాడు.. ఏం బాలేదని అడిగితే ఏమో అన్నా.. సినిమా చూడలేదు.. యూట్యూబ్ లో రివ్యూ చూశా.. బాలేదని రాశారని చెప్పాడు.. సినిమా కోసం పాజిటివ్ రాయకపోయినా పర్లేదు కానీ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు.. అది కరెక్ట్ కాదు.. సినిమాను బతికిద్దాం..” అంటూ చెప్పుకొచ్చాడు రవి.

కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించాలని.. మన కోసం రెండు, మూడేళ్లు కష్టపడి సినిమా చేస్తారని.. అలాంటిది వారు శ్రమ గురించి నెగెటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. యూట్యూబ్‌లో లైక్స్ కోసం ఏవోవే రాస్తున్నారని అది తప్పని రవి తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు.