బుల్లితెర నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది సక్సెస్ అయ్యారు. ఆ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పాల్సింది అనసూయ గురించే.. యాంకర్ గా తన అందం, చలాకీతనంతో ఆకట్టుకున్న అనసూయ సినిమాల్లోనూ రాణిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన పై విమర్శలు చేసే వారికి తన స్టైల్లో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ. తనను ట్రోల్ చేసే నెటిజన్స్ కు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ లు కూడా ఇస్తూ ఉంటారు అనసూయ. తాజాగా ఈ అమ్మడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తోంది ఆ సినిమా పేరే విమానం. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా అనసూయ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మే డే సందర్భంగా సోమవారం అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అనసూయ స్టన్నింగ్ లుక్ లో కనిపించారు.
చీరకట్టులో ముక్కుపుడక ధరించి గద్దెపై కూర్చొని ఉన్న లుక్ ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీ సినిమాస్ స్టూడియో, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ సినిమానుంచి ఓ లిరికల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఒకప్పటి అందాల తార మీరాజాస్మిన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..