Anasuya Bharadwaj : ‘పుష్ప’ సినిమాలో ఆ పాత్రలో రంగమ్మత్త.. క్లారిటీ ఇచ్చిన అందాల యాంకర్..

స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం టీవీ షోలతో అటు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అనసూయ సుకుమార్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత గా నటించి అందరిని ఆకట్టుకుంది.

Anasuya Bharadwaj : పుష్ప సినిమాలో ఆ పాత్రలో రంగమ్మత్త.. క్లారిటీ ఇచ్చిన అందాల యాంకర్..

Updated on: Mar 03, 2021 | 11:42 AM

Anasuya in Pushpa movie: స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం టీవీ షోలతో అటు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అనసూయ సుకుమార్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త గా నటించి అందరిని ఆకట్టుకుంది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది ఈ అందాల యాంకర్.

అయితే ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం అనసూయ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. ఆ స్టార్ హీరో సినిమా మరేదో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లక్కీ గర్ల్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఇటీవల విడుదలైన బన్నీ లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఉరమాస్ లుక్ లో బన్నీ ఆకట్టుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే ‘పుష్ప’ సినిమాలో కీలక పాత్రలో అనసూయ నటిస్తుందని గత కొద్దిరోజులు వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు పుష్ప సినిమాలో హాట్ హాట్ పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ గుసగుసలపై తాజాగా అనసూయ స్పందించింది. తాను పుష్ప సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇంతవరకు తనను ఎవ్వరు సంప్రదించలేదని తెలిపింది. ఒక వేళ ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా అని తెలిపింది రంగమ్మత. దాంతో పుష్ప సినిమాలో అనసూయ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక ఇటీవల కార్తికేయ నటిస్తున్న చావు కబురు చల్లగా అనే సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ అందాల యాంకర్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam Serial : అందరి ముందు పెద్ద పంచాయతీ.. కార్తీక్ మూర్కుడు అని తేల్చేసిన తండ్రి.. ఉత్కంఠగా మారిన నేటి ఎపిసోడ్

Rang De movie : సూపర్ స్టార్ చేతులమీదుగా సూపర్ సాంగ్ ను రిలీజ్ చేయనున్న దేవిశ్రీ..