Ambani Wedding: అంబానీ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్.. సౌత్ నుంచి ఎవరెవరు వెళ్లారంటే..

|

Jul 12, 2024 | 5:27 PM

హాలీవుడ్ బ్యూటీస్ కిమ్ కర్దాషియన్, ఖోలో కర్దాషియన్, అడెలె, లానా డెల్ రే, డ్రేక్ , డేవిడ్ బెక్‌హాం ​​అతని భార్య విక్టోరియా బెక్‌హామ్‌, జాన్ సినా, ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులు ముంబై చేరుకున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా బాలీవుడ్ సినీ ప్రముఖులు అంబానీ పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు అంబానీ పెళ్లి వేడుకల కోసం ముంబై చేరుకున్నారు.

Ambani Wedding: అంబానీ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్.. సౌత్ నుంచి ఎవరెవరు వెళ్లారంటే..
Ambani Wedding
Follow us on

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు వీరిద్దరి వివాహం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో జరగనుంది. ఓవైపు ముంబైలో వర్షం కురుస్తున్నప్పటికీ పెళ్లి వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు, దేశ దేశాల సెలబ్రెటీస్ హాజరవుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖు, పారిశ్రామికవేత్తలు అంబానీ పెళ్లి వేడుకల కోసం ముంబై చేరుకున్నారు. హాలీవుడ్ బ్యూటీస్ కిమ్ కర్దాషియన్, ఖోలో కర్దాషియన్, అడెలె, లానా డెల్ రే, డ్రేక్ , డేవిడ్ బెక్‌హాం ​​అతని భార్య విక్టోరియా బెక్‌హామ్‌, జాన్ సినా, ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులు ముంబై చేరుకున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా బాలీవుడ్ సినీ ప్రముఖులు అంబానీ పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు అంబానీ పెళ్లి వేడుకల కోసం ముంబై చేరుకున్నారు.

గురువారమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి ముంబై చేరుకున్నారు. నిన్న బేగంపేట విమానాశ్రయంలో కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్‌లో కనిపించారు. ఇక ఈరోజు ఉదయం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నాగచైతన్య, రష్మిక మందన్నా, సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ పలువురు దర్శక నిర్మాతలు హాజరు కానున్నారు. అలాగే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె సోదరి అనమ్ మీర్జాతో కలిసి హాజరయ్యే అవకాశం ఉంది.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈ ఏడాది మార్చిలో జామ్ నగర్ లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజులపాటు దాదాపు 1200 మంది అతిథులకు ఆతిథ్యం అందించారు. ఆ తర్వాత బాలీవుడ్ సెలబ్రెటీలతో కలిసి దాదాపు 800 మంది ఆతిథులతో యూరప్ లో లగ్జరీ క్రూయిజ్‌లో రెండవ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.