AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రిన్సిపాల్ మేడం పిచ్చెక్కిస్తుందిగా..! సినిమాలో అలా.. సోషల్ మీడియాలో ఇలా..

సాధారణంగా థియేటర్లలో రిలీజయ్యాకే ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. అయితే ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా ఇప్పుడు రివర్స్ లో థియేటర్లలో విడుదలవుతోంది. అదే అక్కినేని సుమంత్ హీరోగా నటించిన అనగనగా. ఇటీవలే నేరుగా ఈటీవీ విన్ లో విడుదలైన ఈ మూవీ అందరి మన్ననలు అందుకుంటోంది

ప్రిన్సిపాల్ మేడం పిచ్చెక్కిస్తుందిగా..! సినిమాలో అలా.. సోషల్ మీడియాలో ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2025 | 11:07 AM

Share

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుమంత్ ఒకరు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సుమంత్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. 1999లో వచ్చిన ప్రేమ కథ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2003లో వచ్చిన సత్యం సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నాడు. అలాగే ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్ళీరావా, సీతా రామం సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు సుమంత్. ఇక రీసెంట్ గా అనగనగా అనే సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా డైరెక్ గా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

నేరుగా ఈటీవీ విన్ లో విడుదలైన ఈ మూవీ అందరి మన్ననలు అందుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పిల్లల చదువు, పెంపకం, తల్లి దండ్రుల బాధ్యత గురించి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారని అనగనగా సినిమా యూనిట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సన్నీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లో వ్యాస్ పాత్రలో సుమంత్ మరోసారి అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నటి గుర్తుందా.? స్కూల్ ప్రిన్సిపాల్ పాత్రలో నటించింది.. ఆమె పేరు కాజల్ చౌదరి.

తమిళ్ సినిమాతో హీరోయిన్ గా పరిచమైన ఈ చిన్నది.. ఆతర్వాత అనగనగ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గానే కాదు సుమంత్ భార్యగా.. ఓ బిడ్డకు తల్లిగా అద్భుతంగా నటించింది ఆమె.. అయితే సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన ఆమె సోషల్ మీడియాలో మాత్రం బీభత్సం అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ చిన్నది తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..