
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా వరుస ఆఫర్లతో దూసుకుపోయిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్లో సెటిల్ అయ్యింది. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం హిందీ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల డాక్టర్ జీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్.. ఆశించిన స్తాయిలో మెప్పించలేకపోయింది. మరోవైపు కొద్ది రోజులుగా రకుల్ డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఆమె వివాహం జరగనున్నట్లు వార్తలు రావడంతో.. వాటిని ఖండించింది రకుల్. ఇక తాజాగా గతంలో ఆమె చేసిన కొన్ని ఇప్పుడు నెట్టింట్ హాట్ టాపిక్‌గా మారాయి. తన కొడుకు ఒకవేళ గే అని తెలిస్తే అతడి చెంప పగలగొడతాను అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
2011లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్న రకుల్ కు.. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. రకుల్ స్పందిస్తూ.. ” ఒకవేళ నా కుమారుడు గే అయితే.. ఆ విషయం తెలిసిన వెంటనే షాకవుతాను. వెంటనే అతడి చెంప పగలకొడతాను. కానీ ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. అతడి నిర్ణయాన్ని గౌరవించి.. తనకు మద్దతుగా నిలబడతాను.
తను అలాగే బతకాలనుకుంటే దాని వల్ల నాకు ఎలాంటి సమస్య లేదని చెప్పడమే కాకుండా.. ఆ దారిలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో తనకు సాయం చేస్తాను. ఎందుకంటే నేను ముక్కుసూటిగా ఉండే మనిషిని. అలాగే ఉండేందుకు ఇష్టపడతాను. ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.