
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇండియా వైడ్ గానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. పుష్ప సినిమా లో అల్లు అర్జున్ ఊర మాస్ పాత్రలో కనిపించాడు. మునుపెన్నడూ కనిపించని మాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు. అలాగే అల్లు అర్జున్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలాగే పుష్ప సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
పుష్ప సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీ వల్లి, ఉ అంటావా మామ సాంగ్స్ ప్రపంచాన్నే ఊపేసాయి. శ్రీవల్లీ సాంగ్ లో అల్లు అర్జున్ హుక్ స్టెప్ చాలా పాపులర్ అయ్యింది. చాలా మంది ఈ స్టెప్ వేసి రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. సెలబ్రెటీలు కూడా ఈ హుక్ స్టెప్ వేసి అలరించారు. ముఖ్యంగా క్రికెటర్స్ ఈ స్టెప్పును వేసి ఆకట్టుకున్నారు.
తాజాగా శ్రీవల్లి సాంగ్ గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో అల్లు అర్జున్ గురించి ఓ ప్రశ్న వచ్చింది. దాంతో పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీవల్లీ పాటలో అల్లు అర్జున్ స్టెప్ గురించి కామెంట్స్ చేశారు బిగ్ బి. పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ నటన అద్భుతం. శ్రీవల్లి సినిమాలో చెప్పు వదిలేస్తే వైరల్ అవ్వడం నీ జీవితంలో మొదటి సారి చూశా అని అన్నారు అమితాబ్ బచ్చన్. ఈ పాట వచ్చాకా చాలా మంది ఈ స్టెప్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అందరూ చెప్పులు వదిలేసి.. మళ్లీ వేసుకోవడం చేశారు అంటూ సరదాగా చెప్పారు అమితాబ్ బచ్చన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.