AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ప్రియాంకాకు సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆనందంలో తేలిపోయిన అమ్మడు

ఇన్ని రోజులు తమ వారిని మిస్ అయ్యిన హౌస్ మేట్స్ ఒక్కసారిగా వాళ్ళను చూసి ఎమోషనల్ అవుతారు. సీజన్ 7 లోనూ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపించారు. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా శివాజీ కొడుకును డాక్టర్ లా హౌస్ లోకి పంపి సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. కొడుకును చూసి ఎమోషనల్ అయ్యాడు శివాజీ.

Bigg Boss 7 Telugu: ప్రియాంకాకు సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆనందంలో తేలిపోయిన అమ్మడు
Bigg Boss 7 Telugu
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2023 | 1:25 AM

Share

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. ప్రతి సీజన్ లానే ఈ సీజన్ లో కూడా ఎమోషనల్ ఎపిసోడ్ జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో ఉండే హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపిస్తాడు బిగ్ బాస్. ఇన్ని రోజులు తమ వారిని మిస్ అయ్యిన హౌస్ మేట్స్ ఒక్కసారిగా వాళ్ళను చూసి ఎమోషనల్ అవుతారు. సీజన్ 7 లోనూ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపించారు. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా శివాజీ కొడుకును డాక్టర్ లా హౌస్ లోకి పంపి సర్ ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. కొడుకును చూసి ఎమోషనల్ అయ్యాడు శివాజీ. ఆతర్వాత అశ్విని అమ్మ రమా గారిని హౌస్ లోకి పంపించాడు. తల్లిని చూసిన అశ్విని ఏడ్చేసింది.

ఇక్కడ ఉండలేక పోతున్నా.. వచ్చేస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అశ్విని.. కూతురి దైర్యం చెప్పారు అశ్విని తల్లి రమా. ఆతర్వాత అర్జున్ సతీమణి హౌస్ లోకి వచ్చింది. ఆమెను చూసిన అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. ఆమె గర్భంతో ఉండటంతో కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే హౌస్ లో ఉన్న వారు ఆమెకు సీమంతం చేశారు. దాంతో అటు అర్జున్, అతని భార్య ఇద్దరు ఎమోషనల్ అయ్యారు.

ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో గౌతమ్ మదర్ హౌస్ లోకి వచ్చారు. కన్నయ్య అంటూ హౌస్ లోకి వచ్చిన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు గౌతమ్. బాగా ఆడుతున్నావ్ అంటి దైర్యం చెప్పారు గౌతమ్ మదర్. ఆతర్వాత గోరు ముద్దలు కలిపి అందరికి తినిపించారు. అది చుసిన యావర్ ఎమోషనల్ ఆయ్యాడు. ఆతర్వాత విడుదల చేసిన ప్రోమోలో ప్రియాంకకు సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆమె ప్రియుడు శివ్ ను హౌస్ లోకి పంపించాడు. అతడిని చూసిన ప్రియాంక ఆనందంలో తేలిపోయింది. హౌస్ లోకి వచ్చిన తర్వాత ప్రియాంకను ముద్దులతో ముంచెత్తాడు శివ్. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని ప్రియాంక అడగ్గా.. బయటకు రాగానే చేసుకుందాం అని చెప్పాడు శివ్. ఆతర్వాత ప్రియాంక ఎమోషనల్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే