అమలాపాల్ ‘ఆమె’ రిలీజ్ ఎప్పుడంటే?

సౌత్‌లో ఏస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అమలాపాల్ నటించిన వివాదాస్పద చిత్రం ‘ఆమె’. ఈ మూవీ కోసం ఆమె నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే. తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు.  థ్రిల్లర్ జోనర్‌లో యూనిక్  కాన్సెప్ట్‌తో ద‌ర్శకుడు ర‌త్నకుమార్  ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇప్పటికే విడుద‌లైన ప్రోమోలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి కాగా తాజాగా ‘ఆమె’ మూవీ టీం రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేసింది.  […]

అమలాపాల్ ఆమె రిలీజ్ ఎప్పుడంటే?

Updated on: Jul 02, 2019 | 5:18 PM

సౌత్‌లో ఏస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అమలాపాల్ నటించిన వివాదాస్పద చిత్రం ‘ఆమె’. ఈ మూవీ కోసం ఆమె నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే. తమిళంలో ‘ఆడై’ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు.  థ్రిల్లర్ జోనర్‌లో యూనిక్  కాన్సెప్ట్‌తో ద‌ర్శకుడు ర‌త్నకుమార్  ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇప్పటికే విడుద‌లైన ప్రోమోలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి

కాగా తాజాగా ‘ఆమె’ మూవీ టీం రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేసింది.  జులై 19న అమలాపాల్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు సిద్దమైంది. ప్రదీప్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. కార్తిక్ ఖ‌న్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రముఖ ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఈ చిత్రం తెలుగు హ‌క్కులను సొంతం చేసుకున్నారు.