ALLU SIRISH: ఇన్‌స్టాలో పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన శిరీష్! ఆరోజు అల్లు అర్జున్‌ లైఫ్‌లో వెరీ స్పెషల్‌ డే?

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ పెళ్లికి సమయం ఆసన్నమైంది. అల్లు అరవింది చిన్న కుమారుడు, యంగ్ హీరో శిరీష్‌ తన పెళ్లి డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. సాధారణ అనౌన్స్‌మెంట్ కాకుండా వైరల్ ట్రెండ్‌ను ఫాలో అయి స్టైలిష్ వీడియో రూపంలో ఈ శుభవార్త పంచుకున్నారు.

ALLU SIRISH: ఇన్‌స్టాలో పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన శిరీష్! ఆరోజు అల్లు అర్జున్‌ లైఫ్‌లో వెరీ స్పెషల్‌ డే?
Allu Sirish And Nayanika

Updated on: Dec 30, 2025 | 7:45 AM

పెళ్లి పీటలెక్కనున్న శిరీష్‌ స్పెషల్ వీడియో చేసి దాన్ని షేర్ చేశాడు. ఆ వీడియోలో అన్నయ్య అర్జున్ పిల్లలతో కలిసి ఫన్ చేస్తూ డేట్ రివీల్ చేశాడు. ఆ డేట్ సాధారణం కాదు, అల్లు ఫ్యామిలీకి భారీ సెంటిమెంట్ ఉంది. ఏ డేట్ ఫిక్స్ అయింది. ఆరోజు అల్లు అర్జున్‌కు ఎందుకు స్పెషల్ తెలుసా.

అల్లు శిరీష్ నయనిక రెడ్డి నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న ఘనంగా జరిగిన ఆ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఖరారు అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫన్ రీల్‌లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హతో కలిసి శిరీష్ ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. పిల్లలు బాబాయ్ పెళ్లి ఎప్పుడు అంటూ అడగ్గా మార్చి 6, 2026 అని చెప్పారు. సంగీత్ ఉంటుందా అని అడిగితే దక్షిణాది వాళ్లమని, మా సంప్రదాయాలు వేరని ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఆ డేట్‌లో ఉన్న స్పెషల్ సెంటిమెంట్ ఏమిటో తెలుసా?

అన్నయ్య అర్జున్ కు ఏంటి స్పెషల్?

అల్లు శిరీష్ – నయనిక రెడ్డి పెళ్లి మార్చి 6, 2026న జరగనుంది. ఈ డేట్ యాదృచ్ఛికంగా ఎంచుకున్నది కాదు. అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి వివాహం కూడా 2011లో మార్చి 6న జరిగింది. కుండలి ప్రకారం రెండు డేట్లు వచ్చాయని, వెన్యూ అవైలబిలిటీ బట్టి మార్చి 6ను ఎంచుకున్నామని శిరీష్ చెప్పాడు. తర్వాతే ఈ హ్యాపీ కాయిన్సిడెన్స్ గుర్తుకు వచ్చిందని తెలిపాడు. అన్నయ్య జీవితం ఇన్‌స్పిరేషన్ అని, తనదీ అలాంటి జర్నీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Allu Arjun And Sneha Reddy

శిరీష్ పెళ్లి స్పెషల్స్ ఏంటి?

శిరీష్ పోస్ట్ చేసిన రీల్‌లో పిల్లలతో కలిసి ట్రెండింగ్ మీమ్‌ను రీక్రియేట్ చేశారు. సౌత్ ఇండియన్ సంప్రదాయాలు మా సొంతమని, సంగీత్ లేదని ఫన్నీగా చెప్పడం అభిమానుల్ని అలరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అల్లు ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు కొనసాగుతున్నాయి. మార్చి 6న అల్లు ఇంట డబుల్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అర్జున్ దంపతుల యానివర్సరీతో పాటు శిరీష్ పెళ్లి కూడా ఒకేసారి జరగడం స్పెషల్.

అల్లు శిరీష్ – నయనిక లవ్ స్టోరీ వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లి సమయంలో మొదలైంది. 2023 నుంచి డేటింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ సెంటిమెంట్ డేట్‌తో అల్లు ఫ్యామిలీ మరింత ఆనందంలో మునిగితేలుతోంది. అభిమానులు కూడా కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.