
Allu Arjun Pushpa Movie : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్న పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించని సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా చిత్రీకరణ పూర్తిఅయింది. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. అలాగే ఈ సినిమా హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. పుష్ప లో బన్నీ ఉరమాస్ లుక్ కు ట్రెమండ్రస్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తుంది.
పుష్ప సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ పుష్ప ను అద్బుతంగా చిత్రీకరిస్తున్నాడు. సినిమా చిత్రీకరణ నుండి మొదలుకుని ఐటెం సాంగ్ వరకు అన్ని విషయాల్లో కూడా సుకుమార్ తన దైన శైలిని కంటిన్యూ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఒక ఐటెం సాంగ్ ను ఇప్పటికే ట్యూన్ చేశాడట. సుకుమార్ సినిమాలో ఐటెం సన్గ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.. ఇప్పుడు ఈ పాట కూడా సూపర్ గా వచ్చిందని తెలుస్తుంది . మాస్ ఆడియన్స్ చొక్కాలు చించుకనే విధంగా ఈ ఐటెం సాంగ్ ఉందని మేకర్స్ అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :