Pushpa 2 The Rule: పుష్పాగాడి రూలు .. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న ఐకాన్ స్టార్

పుష్ప2 మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగేలా చేస్తున్నారు. మూడు నిమిషాల 14సెకండ్ల వీడియో గ్లింప్స్‌ తో.. ఫిల్మ్ లవర్స్‌ అందర్నీ.. చుట్టేశారు. ఇక ఇప్పుడు ఏంచక్కా.. ఏ సినిమాకు పాజిబుల్ కాని విధంగా.. ఓ నయా రికార్డ్‌ను క్రియేట్ చేశారు.

Pushpa 2 The Rule: పుష్పాగాడి రూలు .. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న ఐకాన్ స్టార్
Pushpa 2

Updated on: Apr 12, 2023 | 7:42 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ గా మారిపోయారు. అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫాంలలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు. పుష్ప2 మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగేలా చేస్తున్నారు. మూడు నిమిషాల 14సెకండ్ల వీడియో గ్లింప్స్‌ తో.. ఫిల్మ్ లవర్స్‌ అందర్నీ.. చుట్టేశారు. ఇక ఇప్పుడు ఏంచక్కా.. ఏ సినిమాకు పాజిబుల్ కాని విధంగా.. ఓ నయా రికార్డ్‌ను క్రియేట్ చేశారు.

బన్నీ బర్త్‌డే కానుకగా..! ఆయన ఫ్యాన్స్‌ దిల్‌ ఖుష్‌ చేయడమే టార్గెట్‌గా..! రిలీజ్‌ అయిన పుష్ప2 వీడియో గ్లింప్స్ ఇప్పుడు యూట్యూబ్లో నయా రికార్డును క్రియేట్ చేసింది. అన్ని లాంగ్వేజెస్‌లో కలిపి.. ఈ వీడియో గ్లింప్స్‌ దాదాపు 82మిలియన్ వ్యూస్‌ పైగా సాధించేసింది.

ఇక ఈ ఫీట్‌తో.. ఈ రేంజ్‌ రెస్పాన్స్‌తో.. ఇప్పుడు యూట్యూబ్‌లో నెంబర్ 1 వీడియో గా ట్రెండ్ అవుతున్నాడు పుష్ప రాజ్. ట్రెండ్ అవడమే కాదు.. ఆ ప్లాట్‌ ఫాంను షేక్ అయ్యేలా చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో ఇప్పటి నుంచే అరిపించేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేశారు. తమ పోస్ట్‌ తో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.