Allu Arjun : అల్లు అర్జున్ ప్లాన్ మాములుగా లేదుగా.. ఆ స్టార్ డైరెక్టర్‌తో బన్నీ నెక్స్ట్ సినిమా

|

Sep 19, 2021 | 9:23 AM

టాలీవుడ్‌లో ఉన్న హిట్ కాంబినేషన్స్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబో ఒకటి. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు మూడు సూపర్ హిట్స్‌ను ప్రేక్షకులకు అందించారు.

Allu Arjun : అల్లు అర్జున్ ప్లాన్ మాములుగా లేదుగా.. ఆ స్టార్ డైరెక్టర్‌తో బన్నీ నెక్స్ట్ సినిమా
Bunny
Follow us on

Allu Arjun :  టాలీవుడ్‌లో ఉన్న హిట్ కాంబినేషన్స్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబో ఒకటి. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు మూడు సూపర్ హిట్స్‌ను ప్రేక్షకులకు అందించారు. మొదటగా త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన డ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సినిమా ఆద్యంతం లాజిక్స్ తో సాగుతూ.. ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత ఓ సాందేశాత్మక కథాంశంతో సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమా చేశారు ఈ ఇద్దరు. తండ్రి గౌరవాన్ని కాపాడే కొడుకుగా ఈ సినిమాలో కనిపించడు బన్నీ. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని కాపాడుకునే యువకుడిగా బన్నీ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. గత ఏడాది విడుదలైన అలవైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడమేకాకుండా రికార్డ్స్‌ను కూడా క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయబోయితున్నారని ఓ వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమవుతున్నది తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ సినిమా కోసం రెడీ అవుతున్నారు.  సర్కారు వారి పాట సినిమా పూర్తయిన తరువాత త్రివిక్రమ్ మహేష్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అటు పుష్ప సినిమాతోపాటు ఐకాన్ అనే సినిమా చేస్తున్నాడు బన్నీ ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ తో చేతులు కలపనున్నాడు బన్నీ. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉండనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Salman Khan : చిన్న యాడ్ కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న సల్మాన్.. ఎంత తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Surya: భయపడకండి.. నీట్‌ పరీక్షపై ఆందోళన వద్దు.. విద్యార్థులకు హీరో సూర్య సందేశం

Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరో తెలుసా..

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..