Allu Arjun Case: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ నేడు కోర్టు విచారణ..

|

Dec 30, 2024 | 10:10 AM

సంద్యథియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాలను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది.

Allu Arjun Case: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ నేడు కోర్టు విచారణ..
Allu Arjun
Follow us on

సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ రెగ్యులర్‌ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. బెయిల్ పిటిషన్‌పై ఇవాళ పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. — ఈ నెల 27న జరిగిన విచారణలో కౌంటర్‌కి సమయం కోరారు పోలీసులు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో ఆ రోజు వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు అల్లు అర్జున్. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు జనవరి 10న విచారణ జరపనుంది. అల్లు అర్జున్‌ రిమాండ్‌పైనా అదే రోజు విచారణ జరగనుంది.

ఇక పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో ప్రీమియర్స్ వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ ను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు డిసెంబర్‌ 13న 14 రోజుల రిమాండ్‌ విధించింది నాంపల్లి కోర్టు. దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వొకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ వచ్చినా మర్నాడు ఉదయం చంచల్‌గూడ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు.

బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరగా.. నాంపల్లి కోర్టు విచారణను నేడు( సోమవారం) వాయిదా వేసింది. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో విచారణనూ నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.