‘పలాస 1978’ సినిమా బాగా నచ్చింది, బన్నీ ప్రశంస

|

Oct 02, 2020 | 2:13 PM

యాథార్థ సంఘటనల ఆధారంగా  'పలాస 1978' సినిమా తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ దర్శకుడిని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు.

పలాస 1978 సినిమా బాగా నచ్చింది, బన్నీ ప్రశంస
Follow us on

యాథార్థ సంఘటనల ఆధారంగా  ‘పలాస 1978’ సినిమా తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ దర్శకుడిని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు.  గొప్ప అంతర్లీన సందేశంతో దర్శకుడు అద్భుతమైన ప్రయత్నం చేశారని, వ్య‌క్తిగతంగా చిత్రం నాకు చాలా నచ్చిందన్నారు బన్నీ.  ‘పలాస 1978’ చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ కు మొక్కను బహూకరించారు అల్లు అర్జున్.

మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందజేసిన అల్లు అర్జున్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కరుణ కమార్. తన జీవితంలో ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ కరుణ కుమార్ ట్వీట్ చేశారు.


Also Read :

“ఆ” చాట్ చెయ్యాలట, దెబ్బకు చిప్పకూడు తింటున్నాడు

బొమ్మ బ్లాక్ బస్టర్ : టీజర్ సూపర్ !