Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు… 400 మిలియన్ లైక్స్ సాధించిన బుట్ట బొమ్మ సాంగ్..

Ala Vaikunthapurramuloo Movie:  స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‏లో వచ్చిన 'అల వైకుంఠపురం'

Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు... 400 మిలియన్ లైక్స్ సాధించిన బుట్ట బొమ్మ సాంగ్..
Butta Bomma

Updated on: May 23, 2021 | 8:20 AM

Ala Vaikunthapurramuloo Movie:  స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‏లో వచ్చిన ‘అల వైకుంఠపురం’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాటలన్ని సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఇందులోని బుట్ట బొమ్మ సాంగ్ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా… ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా.. ఇందులోని పాటలన్ని రికార్డులను సృష్టించాయి. ముఖ్యంగా సిధ్ శ్రీరామ్ ఆలపించిన సామజవరగమన సాంగ్ మ్యూజిక్స్ లవర్స్ ను ఆకట్టుకుంది. ఇక రాములో రాములా సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అల.. వైకుంఠపురం సినిమా గతేడాదిలోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.

Butta Bomma Allu Arjun

ఇందులో అల్లు అర్జున సరసన పూజా హెగ్డే నటించగా.. ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. తాజాగా ఈ సాంగ్ మారో రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్‍లోనే సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ పాట ఇప్పుడు 400 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. సౌత్ ఇండియా 400 మిలియన్ లైక్స్ సాధించిన మొదటి పాటగా ఈ సాంగ్ నిలిచింది. అలాగే మొదటి టీఎఫ్ఐ సాధించిన వీడియోగా కూడా ఈ పాట రికార్డ్ సృష్టించింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

Also Read: సినీ జీవితం చాలా నేర్పించింది… నమ్మకద్రోహులకు దూరంగా ఉండటమే కాదు.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.. చంద్రమోహన్..

దీప కోసం మొదటి సారి ఏడ్చిన కార్తీక్.. అందుకు మా అమ్మ సంతోషంగా ఉంది.. కార్తీక దీపంపై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్..

ఎండాకాలం చల్లగా ఐస్ క్రీం తిన్నాడు.. ఆ తర్వాత మెల్లగా కాలం చేశాడు.. కరోనా వేళ డెజర్ట్స్ తింటే డేంజర్..?

Weight Loss Exercises : బరువు తగ్గడానికి, బెల్లీఫ్యాట్‌ కరగడానికి ఈ నాలుగు ఎక్సర్‌సైజ్‌లు సూపర్..! ట్రై చేసి చూడండి..