Pushpa: తగ్గేదే లే.. రష్యాలో పుష్ప గ్రాండ్ రిలీజ్.. అక్కడ వాలిపోయిన బన్నీ, క్రష్మిక

|

Dec 01, 2022 | 8:23 AM

పుష్పా రష్యాలో హల్‌చల్‌ చేయబోతున్నాడు. ఈనెల 8న రష్యా వ్యాప్తంగా స్థానిక భాషలో రిలీజ్‌ కాబోతోంది ఈ బ్లాక్‌ బస్టర్‌. దీనికోసం ప్రమోషన్స్‌ కూడా చేస్తోంది పుష్ప టీమ్‌.

Pushpa: తగ్గేదే లే.. రష్యాలో పుష్ప గ్రాండ్ రిలీజ్.. అక్కడ వాలిపోయిన బన్నీ, క్రష్మిక
Allu Arjun and Rashmika Mandanna have arrived in Russia to promote Pushpa.
Follow us on

రష్యాలోనూ తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్‌. లాస్ట్‌ ఇయర్‌ విడుదలై.. పాన్‌ ఇండియా లెవెల్లో అద్భుత విజయం సాధించిన పుష్ప ది రైజ్‌ ఇప్పుడు రష్యాలోనూ విడుదలవుతోంది. రష్యన్‌ లాంగ్వేజ్‌లో డబ్బింగ్‌ చేసి రష్యా వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. దీనికి కారణం అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజే. గతంలో అల్లు అర్జున్‌ సినిమాలు చాలా రష్యాలో మంచి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు కూడా అదే ధీమాతో రష్యాలో రిలీజ్‌ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే రష్యాలో విడుదలైన ట్రైలర్‌ అదరగొడుతోంది. బన్నీ తగ్గేదే లే అని రష్యన్‌ భాషలో చెప్పిన డైలాగ్‌ కూడా వైరల్‌ అవుతోంది.

ఇక సినిమా ప్రమోషన్స్‌ కోసం రష్యాలో బిజీగా ఉంది టీమ్‌. చానల్స్‌, రేడియోస్‌, పబ్లిక్‌ ప్రెస్‌మీట్స్‌ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తూ హీట్‌ పుట్టిస్తోంది పుష్ప టీమ్‌. తన ఐకానిక్‌ తగ్గేదే లే డైలాగ్స్ తో పుష్పాని ప్రమోట్‌ చేస్తున్నాడు. డిసెంబర్‌ 3 వరకు అక్కడే ఉంటోంది పుష్ప టీమ్‌. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో అభిమానులతో స్పెషల్‌ స్క్రీనింగ్‌లో పాల్గొనబోతోంది. ఈరోజు మాస్కోలో, డిసెంబర్‌ మూడున సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రీమియర్స్‌ ఉంటాయని.. ఫ్యాన్స్‌ అందరూ రావాలంటోంది రష్మిక.

ఐకాన్‌స్టార్‌ క్రేజ్‌ ఎలా ఉందంటే.. రష్యా అధికారులే అభిమానులైపోయారు. యుద్ధం సమయంలో రష్యాలో ఉన్న అధికారులు.. అమెరికాకు వార్నింగ్‌ ఇస్తూ.. పుష్పా డైలాగ్‌ చెప్పారు. ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు రష్యన్‌ లాంగ్వేజ్‌లో డబ్‌ అయ్యి విజయం సాధించాయి. ఆ మధ్య ట్రిపులార్‌ని రష్యన్‌ లాంగ్వేజ్‌లో రిలీజ్‌ చేశారు రాజమౌళి. అక్కడ ప్రమోషన్స్‌లోనూ పాల్గొన్నారు. అదే ధీమాతో పుష్ప టీమ్‌ ఇక్కడకు ల్యాండైంది. డిసెంబర్‌ 8నుంచి రష్యా వ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా రష్యన్‌లోనూ బంపర్‌ హిట్‌ అవుతుందని హోప్‌తో ఉంది టీమ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..