Allu Aravind: రామ్ చరణ్ నా కొడుకు లాంటోడబ్బా! ఇక్కడితో ఆపేయాలన్న అల్లు అరవింద్.. వీడియో

|

Feb 10, 2025 | 5:54 PM

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా- అల్లు అభిమానుల మధ్య వైరం నడుస్తోంది. ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో మెగాభిమానులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

Allu Aravind: రామ్ చరణ్ నా కొడుకు లాంటోడబ్బా! ఇక్కడితో ఆపేయాలన్న అల్లు అరవింద్.. వీడియో
Allu Aravind , Ram Charan
Follow us on

ఇటీవల తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ గా మారాయి. దిల్ రాజును స్టేజి మీదకి ఆహ్వానిస్తూ.. వారం రోజుల్లోనే హిట్టు, ఫ్లాపు, ఐటీ రైడ్స్ అన్నీ చూశాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓ సినిమాను ఇలా.. ఓ సినిమాను అలా అంటూ గేమ్ ఛేంజర్ సినిమాపై సెటైర్లు వేశారని అల్లు అరవింద్ పై ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా మెగా అభిమానులు అల్లు అరవింద్ మాటలకు
బాగా ఫీలయ్యారు. తాజాగా ఇదే విషయంపై మెగా నిర్మాత వివరణ ఇచ్చారు. ‘రామ్ చరణ్ నాకు కొడుకు లాంటివాడు.. నాకు ఉన్న ఒకే ఒక మేనల్లుడు. అతనికి ఉన్న ఒకే ఒక మేనమామను నేను. మా ఇద్దరి మధ్య అనుబంధం ఎప్పుడు ఆరోగ్యకరంగానే ఉంటుంది. అనుకోకుండా అన్న మాటే కానీ.. ఉద్దేశపూర్వకంగా అనలేదు. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’ అని వివరణ ఇచ్చారు అల్లు అరవింద్.

అల్లు అరవింద్ స్పీచ్.. వీడియో ఇదిగో..
&

nbsp;