Kithakithalu : కితకితలు సినిమాను రూ.80 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు వచ్చాయంటే.. బయటపెట్టిన హీరో నరేష్..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన కితకితలు సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా కామెడీ సినీప్రియులకు ఈ సినిమా ప్రత్యేకం. దర్శకుడు EVV సత్యనారాయణ తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, గీతా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో అల్లరి నరేష్.

Kithakithalu : కితకితలు సినిమాను రూ.80 లక్షలతో తీస్తే ఎన్ని కోట్లు వచ్చాయంటే.. బయటపెట్టిన హీరో నరేష్..
Allari Naresh

Updated on: Jan 31, 2026 | 6:11 PM

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కితకితలు సినిమాకు సంబంధించిన అనేక తెలియని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమాకు తన తండ్రి, దివంగత దర్శకుడు EVV సత్యనారాయణ చేసిన కృషి, సినిమా విజయం, హీరోయిన్ గీతా సింగ్ పై ఆ మూవీ ప్రభావం, అలాగే సమాజంలో బాడీ షేమింగ్ వంటి అంశాలపై ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కితకితలు సినిమా సబ్జెక్ట్ విన్నప్పుడు, అప్పటికి తను కొన్ని హిట్లతో ఉన్న నేపథ్యంలో, లావుగా ఉండే హీరోయిన్‌ను పెట్టడం సరైన నిర్ణయమేనా అని నరేష్ తన తండ్రిని ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే, “ఏ పాత్రకు ఎవరు కావాలో వారినే తీసుకోవాలి. ఒక ఐశ్వర్యా రాయ్‌ను ఊహించుకున్నవాడికి కల్పనారాయ్ లాంటి భార్య వస్తే ఏంటి?” అనేదే కథ అని EVV సత్యనారాయణ చెప్పి తన సందేహాలను క్లియర్ చేశారని నరేష్ వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

సినిమా బడ్జెట్ విషయంలోనూ మొదట కొన్ని భయాలు ఉన్నాయని నరేష్ అన్నారు. మొదట రూ. 3 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ, “లావు హీరోయిన్‌ను పెడితే సినిమా ఆడుతుందా? ఎవరు కొంటారు?” అనే ప్రశ్నలు తలెత్తడంతో బడ్జెట్‌ను రూ. 80-90 లక్షలకు తగ్గించారని అన్నారు. సినిమాను కేవలం సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే షూట్ చేసి, శని, ఆదివారాలు సెలవులు ఇచ్చారని, ఇది సాధారణంగా తన తండ్రి చేసే పద్ధతి కాదని నరేష్ గుర్తు చేసుకున్నారు. అయితే, తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 8 కోట్లకు పైగా వసూలు చేసి పెద్ద విజయాన్ని సాధించిందని తెలిపారు. గీతా సింగ్‌కు కితకితలు సినిమానే ఆమె కెరీర్‌లో “క్లెయిమ్ టు ఫేమ్” అని నరేష్ అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ఈరోజుకీ ఆమెను ఈ సినిమాతోనే గుర్తిస్తారని, ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పి, ఎంతో కష్టపడిందని ప్రశంసించారు. అయితే, సినిమా సృష్టించిన సామాజిక ప్రభావాన్ని గురించి చెబుతూ, ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో ఒక మహిళ తన షర్ట్ పట్టుకుని, “లావుగా ఉంటే పెళ్ళాన్ని వదిలేస్తావా? ఏ తప్పేంటయ్యా లావుగా ఉంటే?” అని ప్రశ్నించిందని, “మీ సినిమా చూసినప్పటి నుండి మా ఆయన నన్ను కితకితలు హీరోయిన్ లా ఉన్నావని అంటున్నాడు” అని ఆ మహిళ చెప్పినప్పుడు సినిమా ప్రభావం ఎంత ఉందో అర్థమైందని నరేష్ తెలిపారు

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..