తన అప్‌డేట్స్ అన్నీ ఆ ఛానల్‌లోనే అంటున్న అలియా

|

Jun 27, 2019 | 3:37 AM

దర్శకనిర్మాత మహేష్ భట్ రెండో కూతురు అలియా భట్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. అక్కడ టాప్ హీరోయిన్‌గా ఆమె చక్రం తిప్పుతోంది. బోలెడంత ఆదాయం కూడా వస్తోంది. అయినా ఇంకా సంపాదించాలనుకుంటోంది ఈ ముద్దగుమ్మ. అందుకే ఇప్పుడు నిర్మాతగా, మీడియా కంపెనీ ఓనర్‌గా మారుతోంది. ఇలా కొత్త ఇన్‌కం మార్గాలను వెతుకుతోంది ఆలియా. తాజాగా ఆమె యూట్యూబ్ ఛానల్‌ కూడా ఓపెన్ చేసింది. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్..ఆ ఛానల్ ద్వారానే […]

తన అప్‌డేట్స్ అన్నీ ఆ ఛానల్‌లోనే అంటున్న అలియా
Follow us on

దర్శకనిర్మాత మహేష్ భట్ రెండో కూతురు అలియా భట్ నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. అక్కడ టాప్ హీరోయిన్‌గా ఆమె చక్రం తిప్పుతోంది. బోలెడంత ఆదాయం కూడా వస్తోంది. అయినా ఇంకా సంపాదించాలనుకుంటోంది ఈ ముద్దగుమ్మ. అందుకే ఇప్పుడు నిర్మాతగా, మీడియా కంపెనీ ఓనర్‌గా మారుతోంది. ఇలా కొత్త ఇన్‌కం మార్గాలను వెతుకుతోంది ఆలియా.

తాజాగా ఆమె యూట్యూబ్ ఛానల్‌ కూడా ఓపెన్ చేసింది. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్..ఆ ఛానల్ ద్వారానే తన అభిమానులతో పంచుకుంటోందట.ఇప్పటికే అలియా భట్ సోదరి పూజా భట్ నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సోదరి బాటలో అలియా కూడా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టింది. దాని పేరు ‘ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్’. ఈ బ్యానర్ పై మంచి సినిమాలు తీయలనుకుంటున్నట్లు వెల్లడించింది. దీన్ని బలమైన నిర్మాణ సంస్థగా మారుస్తానని నమ్మకంగా చెబుతోంది. హీరోయిన్ గా బాలీవుడ్ లో తన క్రేజ్ చాటుతోన్న ఈ బ్యూటీ నిర్మాతగా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి!