ఈ ఏడాదికి సంబంధించి ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ముంబై వేదికగా ఆదివారం (నవంబర్ 28) నాలుగో ఎడిషన్ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. అలియా భట్ నుండి మనోజ్ బాజ్‌పేయి వరకు పలువురు సినీ ప్రముఖులు ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సందడి చేశారు. వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. అవార్డుల్లో భాగంగా వెబ్ ఒరిజినల్ విభాగంలో ఉత్తమ నటిగా అలియాభట్ నిలిచింది. డార్లింగ్స్ మూవీలో నటనకు గానూ అలియాకు ఈ పురస్కారం దక్కింది. ఇక సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై గానూ ఉత్తమ నటుడిగా మనోజ్‌బాజ్ పాయ్ అవార్డు అందుకున్నారు. ఇక విక్రమాదిత్య మోత్వాని వెబ్ సిరీస్ జూబ్లీ కూడా ఐదుకు పైగా ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెల్చుకుంది. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, ఒరిజినల్ సౌండ్‌ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ VFX కేటగిరీ లో ఈ సిరీస్ కు అవార్డులు దక్కాయి.
The lovely #AliaBhatt took to the stage as she won it big at the #FilmfareOTTAwards2023 co-powered by Hyundai Motor India, Ajio and Film Bandhu – Government of Uttar Pradesh, in association with Fura Gems and ITC Fiama. pic.twitter.com/55dU73YUtS
— Filmfare (@filmfare) November 27, 2023
#Darlings stars #VijayVarma and #AliaBhatt share a sweet hug at the #FilmfareOTTAwards2023 co-powered by Hyundai Motor India, Ajio and Film Bandhu – Government of Uttar Pradesh, in association with Fura Gems and ITC Fiama. pic.twitter.com/XyYo6q4N7d
— Filmfare (@filmfare) November 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.