
అనగనగా సినిమాతో మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు అక్కినేని హీరో సుమంత్. ఇటీవలే ఈటీవీ విన్ ఓటీటీలో డైరెక్టుగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇందులో సుమంత్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. పిల్లల చదువు, పెంపకం, తల్లి దండ్రుల బాధ్యత గురించి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అందుకే చాలా మంది ఈ సినిమాన ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు అనగనగా సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. ఎన్నో సున్నితమైన అంశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారంటూ చిత్రబృందాన్ని అభినందించారు. కాగా 1990 లో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుమంత్. ఈ 25 ఏళ్ల సినిమా కెరీర్ లో సుమారు 30 కు పైగా సినిమాల్లో నటించాడు. అందులో చాలా వరకు ఫీల్ గుడ్ సినిమాలే. అయితే తరుణ్ నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీలో సుమంత్ హీరోగా నటించాల్సిందట.
2000లో వచ్చిన ఆ సినిమా బడ్జెట్ కేవలం కోటి రూపాయలైతే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారి తరుణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పటి యువత ఈ సినిమాకు ఫిదా అయిపోయింది. చాలా థియేటర్లలో ఈ మూవీ 250 రోజులకు పైగా ఆడింది. ఒక వేళ ఈ సినిమాలో సుమంత్ నటించి ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో అనిపిస్తోంది. ఇప్పటికే కూడా సుమంత్ పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అనగనగా సినిమా ప్రమోషన్లలోనూ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘నువ్వేకావాలి సినిమా ఆఫర్ నాకు వచ్చింది. కానీ అది నేను మిస్ చేసుకున్నాను. అందుకు ఫీల్ అయ్యాను.
నా మొత్తం సినీ కెరీర్ లో నా వద్దకు వచ్చి చేయలేకపోయిన సినిమా నువ్వే కావాలి ఒక్కటే. నా కెరీర్ మొదట్లోనే స్రవంతి రవికిషోర్ నాకు నువ్వే కావాలి ఆఫర్ ఇచ్చారు. కానీ డేట్స్ కారణంగా చేయలేకపోయాను. ఆ సమయంలో రాఘవేంద్ర రావు మూవీతో పాటు యువకుడు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నాను.
#Anaganaga is hitting the big screens in Rajahmundry & Kakinada with a grand premiere!
Book your tickets NOW exclusively on the District App and be part of the first-day magic!#Etvwin pic.twitter.com/YyvXdSZmvd
— ETV Win (@etvwin) May 26, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .