Akhil Akkineni : నేను తెలుగువాడిని… బాలీవుడ్ సినిమాలు చేసే ఆలోచన లేదు..: అఖిల్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ సినిమా పై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

Akhil Akkineni : నేను తెలుగువాడిని... బాలీవుడ్ సినిమాలు చేసే ఆలోచన లేదు..: అఖిల్
Akhil

Edited By:

Updated on: Oct 15, 2021 | 8:54 AM

Akhil Akkineni : అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఈ సినిమా పై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అఖిల్ హీరోగా ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. మొదటి సినిమాగా వి.వి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులను నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన హలో సినిమా చేశాడు. ఈ సినిమాకూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే చివరిగా నటించిన మిస్టర్ మజ్ను సినిమా కూడా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా వచ్చాడు అఖిల్.

అఖిల్ – పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ సినిమా ఇది. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్ ఓ ఇంటర్వ్యలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. పెళ్లికి ముందు ఎలా ఉండాలి? పెళ్లి తరువాత ఎలా నడుచుకోవాలి? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది అని అన్నారు. అలాగే బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. నేను తెలుగువాడిని .. ఇక్కడి సినిమాలే చేయాలనుకుంటున్నాను. బాలీవుడ్ కి వెళ్లాలనే ఆలోచన లేదు అన్నారు. అలాగే ప్రస్తుతం ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అన్నాడు అఖిల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్

Loading...
Unable to load recommendations.
Follow Us