Most Eligible Bachelor: అఖిల్ కు బర్త్ డే విషెస్ తెలిపిన మోస్ట్ ఎలిజిబుల్ చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న న్యూ పోస్టర్..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.

Most Eligible Bachelor: అఖిల్ కు బర్త్ డే విషెస్ తెలిపిన మోస్ట్ ఎలిజిబుల్ చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న న్యూ పోస్టర్..
Akhil

Updated on: Apr 08, 2021 | 10:10 AM

Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్  ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే పోస్టర్ విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఈ పోస్టర్‌లో అఖిల్ చాలా స్టైలిష్ లుక్‌తో నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోకు అన్ని వర్గాలనుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌.. రీసెంట్ గా విడుదలైన ఏ జిందగీ పాటకు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంలో ఇప్పుడు బర్త్ డే పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేశారని తెలుస్తుంది. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న అఖిల్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

  ’11th Hour’ Telugu web series: మగవారికన్నా మహిళలే మల్టీ టాలెంటెడ్ : ప్ర‌వీణ్ స‌త్తారు

Happy Birthday Allu Arjun: స్టైల్ కు సరైన అర్ధం చెప్పిన స్టార్.. హ్యాపీ బర్త్ డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ సినిమాకు ఆసక్తికర టైటిల్.. ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త

Follow Us