Ajith Valimai : తమిళ్ స్టార్ హీరో అజిత్(Ajith) నటిస్తున్న లేటెస్ట్ మూవీ వలిమై.. భారీ బడ్జెట్ తో బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. కరోనా కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమాను తెలుగులో బలం పేరుతో రిలీజ్ చేయాలని చూసారు. కానీ ఆ తర్వాత వాలిమై(Valimai) అనే టైటిల్ తోనే పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాలో టాలీవుడ్ కుర్ర హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు.పోలీస్ తో దొంగ ఆడే గేమ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఈ మూవీలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే కార్తికేయ దొంగ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ..
ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ.. “తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ కూడా ఒకే సారి సినిమాను విడుదల చేస్తున్నాం. వాలిమై తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేసాము. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్ధ్యంతం ఉంటుంది. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా! అయినా సరే ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు? అనేది చిత్రం చూసిన తరువాత ఆడియన్స్‌కు అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటిస్తున్నారు అని అన్నారు. ‘వాలిమై’ ని ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :