Ajith: తెలుగు సినిమా టీజర్‌పై ప్రశంసలు కురిపించిన అజిత్‌.. త్వరలోనే చిత్ర యూనిట్‌ను కలుస్తానంటూ..

|

Feb 02, 2021 | 5:14 AM

Ajith Appreciation For Telugu Movie: తమిళ హీరో అజిత్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌ ఉత్సాహానికి అంతేలేకుండా పోతుంది. అలాంటి ఈ స్టార్‌ హీరో ఓ తెలుగు సినిమా..

Ajith: తెలుగు సినిమా టీజర్‌పై ప్రశంసలు కురిపించిన అజిత్‌.. త్వరలోనే చిత్ర యూనిట్‌ను కలుస్తానంటూ..
Follow us on

Ajith Appreciation For Telugu Movie: తమిళ హీరో అజిత్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌ ఉత్సాహానికి అంతేలేకుండా పోతుంది. అలాంటి ఈ స్టార్‌ హీరో ఓ తెలుగు సినిమా టీజర్‌ గురించి స్పందించాడు.
వివరాల్లోకి వెళితే.. సీనియర్ హీరో శ్రీకాంత్‌, భూమికా, సుమంత్‌ అశ్విన్, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రలో ‘ఇదే మా కథ’ అనే సినిమా తెరకెక్కుతోంది. రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నలుగురు వ్యక్తులు కలిసి బైక్‌పై ట్రిప్‌కు వెళుతారు. ఆ సమయంలో వారి మధ్య చోటుచేసుకున్న సంఘటనలు, వారు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్‌ను చూసిన హీరో అజిత్‌ చిత్ర యూనిట్‌పై ప్రశంసలజల్లు కురిపించాడు. తన స్నేహితుడు రామ్‌ ప్రసాద్‌ గారు ‘ఇదే మా కథ’ సినిమా టీజర్‌ను చూపించారని, సినిమా టీజర్‌ చాలా బాగా తీశారని పేర్కొన్నాడు. త్వరలోనే చిత్ర యూనిట్‌ను కలుస్తానని అజిత్‌ మాటిచ్చాడు. దీంతో అజిత్‌లాంటి హీరో తమ సినిమాపై స్పందించడంతో చిత్ర యూనిట్‌ ఫుల్‌ ఖుషీ అవుతోంది. ఇదిలా ఉంటే అజిత్‌ స్వతహాగా మంచి బైక్ రేసర్ అనే విషయం తెలిసిందే. బహుశా అజిత్‌కు ఈ సినిమా టీజర్‌ ఇంతలా నచ్చడానికి కారణం అదే అయ్యుంటుంది.

 

Also Read: ‘Sultan’ Teaser : యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న కార్తి ‘సుల్తాన్’ .. ఆకట్టుకున్న టీజర్..