కన్నడ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హిందీ జాతీయ భాష కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సుదీప్ మాటలను వ్యతిరేకిస్తూ బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ ట్విట్టర్ వేదికగా హిందీ ఎప్పటికీ జాతీయ భాషే అని.. అందుకే హిందీలోకి సినిమాలను డబ్ చేస్తున్నారు కదా అంటూ కౌంటరిచ్చారు. దీంతో సుదీప్, అజయ్ మధ్య ట్వీట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. తాను మాట్లాడిన మాటలు.. ట్రాన్స్లేషన్ పొరపాటు వలన వేరేగా అర్థం చేసుకున్నారంటూ సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. అజయ్ దేవగణ్ మాత్రం ట్విట్టర్ వార్ మాత్రం కొలిక్కి రాలేదు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధం పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య.. కిచ్చా సుదీప్‌కు మద్దతుగా హిందీ జాతీయ భాష కాదంటూ అజయ్ దేవగణ్‌కు కౌంటరిచ్చారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం సుదీప్‌కు మద్దతుగా ట్వీట్ చేశాడు..
” ఇది కాదనలేని నిజం సుదీప్ సార్.. నార్త్ స్టార్స్ సౌత్ స్టార్స్ పై అసూయతో.. అభద్రత భావంతో ఉన్నారు. ఎందుకంటే.. కన్నడ డబ్బింగ్ సినిమా కేజీఎఫ్ 2 విడుదలైన రోజే రూ. 50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో హిందీ సినిమాల ప్రారంభ రోజలను చూడబోతున్నాము.. ” అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి.
The base undeniable ground truth @KicchaSudeep sir ,is that the north stars are insecure and jealous of the south stars because a Kannada dubbing film #KGF2 had a 50 crore opening day and we all are going to see the coming opening days of Hindi films
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022
ముందుగా అజయ్ హిందీలో ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. హిందీ జాతీయ భాష కాకపోతే సౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు అంటూ అజయ్ హిందీలో ట్వీట్ చేశారు. దీంతో సుదీప్ అజయ్‌కు తనదైన శైలీలో సమాధానమిచ్చారు. మీరు చేసిన ట్వీట్ నాకు అర్థమైంది.. హిందీలో పంపిన టెక్ట్స్ నాకు అర్థమైంది. నేను హిందీ భాషను గౌరవిస్తాను.. ప్రేమిస్తాను.. కేవలం ట్రాన్స్ లేషన్ వల్లే పొరపాటు జరిగింది. నేను కన్నడలో రిప్లై ఇస్తే ఎలా అని అలోచిస్తున్నా అంటూ రీట్వీట్ చేశారు సుదీప్.
.@KicchaSudeep मेरे भाई,
आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं?
हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी।
जन गण मन ।— Ajay Devgn (@ajaydevgn) April 27, 2022
And sir @ajaydevgn ,,
I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi.
No offense sir,,,but was wondering what’d the situation be if my response was typed in kannada.!!
Don’t we too belong to India sir.
?— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‌కు మించి ఉంటుందని..