
కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఒకప్పుడు ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ జంట గుర్తొచ్చేది. కానీ దాదాపు 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీరు ముగింపు పలికారు. కొన్ని కారణాలతో వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. డివోర్స్ అనంతరం ఇద్దరు తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత డైరెక్షన్ ఆపేసిన ఐశ్వర్య.. ఇటీవలే తిరిగి మెగా ఫోన్ పట్టింది. ఆమె దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ లాల్ సలామ్. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య.. తన మాజీ భర్త ధనుష్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ జీవితంలో ధనుష్ ఎంత ముఖ్యమైన వ్యక్తి అనే విషయాన్ని బయటపెట్టింది. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారడానికి పూర్తి క్రెడిట్ ధనుష్ అని తెలిపింది.
ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. “అనిరుధ్ గురించి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అతడు సంగీత దర్శకుడిగా మారడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ధనుష్ కారణంగానే అనిరుధ్ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అతడి తల్లిదండ్రులు అనిరుధ్ ను ఎంబీఏ చదివించేందుకు సింగపూర్ పంపించాలనుకున్నారు. కానీ ధనుష్ అందుకు ఒప్పుకోలేదు. అనిరుధ్ కు ఉన్న టాలెంట్ గుర్తించారు. అతడి కళ గురించి తన కుటుంబంతో మాట్లాడి.. ఇండస్ట్రీలో అతడు మంచి వృధ్దిలోకి వస్తాడని చెప్పారు.. సినీ పరిశ్రమలోకి అనిరుధ్ ను పంపించేందుకు అతడి తల్లిదండ్రులను ఒప్పించాడు. అనిరుధ్ కు కీబోర్డు బహుమతిగా ఇచ్చాడు ధనుష్. ఆ తర్వాత అనిరుధ్ కీబోర్డు నేర్చుకున్నాడు.ధనుష్ సహకారం, ఆయన కృషితోనే అనిరుధ్ ఇంత దూరం వచ్చాడు” అని ఐశ్వర్య అన్నారు.
ఐశ్వర్య తెరకెక్కించిన త్రీ సినిమాలోని వై దిస్ కొలవెరి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అనిరుధ్ సంగీతం అందించగా.. ధనుష్ ఆలపించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో అనేక చిత్రాలు వచ్చాయి. ‘జైలర్’, ‘జవాన్’ వంటి చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించారు. తెలుగులోనూ అనేక సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు. ప్రస్తుతం దేవర సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.