అతనితో సినిమా చేస్తే తప్పేంటీ.? అతనికేం తక్కువ..? స్టార్ నటుడి గురించి ఐశ్వర్య లక్ష్మీ కామెంట్స్

ఐశ్వర్య లక్ష్మీ. 1991 సెప్టెంబర్ 6న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది ఈ అందాల భామ. నటనపై ఉన్న ఆసక్తితో మెడిసిన్ చదివి.. సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొదట పలు యాడ్స్ ద్వారా మోడల్‌గా పాపులర్ అయిన ఐశ్వర్య లక్ష్మీకి.. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.2017లో మలయాళ చిత్రం 'మాయానది' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది.

అతనితో సినిమా చేస్తే తప్పేంటీ.? అతనికేం తక్కువ..? స్టార్ నటుడి గురించి ఐశ్వర్య లక్ష్మీ కామెంట్స్
Aishwarya Lakshmi

Updated on: May 15, 2025 | 12:25 PM

తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామల్లో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఇంతవరకు డైరెక్ట్ సినిమా చేయలేదు. త్వరలోనే తెలుగు పేక్షకులను పలకరించనుంది.ఐశ్వర్య 2014లో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. అలాగే 2017లో మలయాళ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ – సౌత్ లభించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమిళ్ లో పలు సినిమాలు చేసి మెప్పించింది. మట్టి కుస్తీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అంతకు ముందు సత్యదేవ్ తో కలిసి గాడ్సే అనే సినిమా చేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సాయి ధరమ్ తేజ్ సరసన నటిస్తుంది. సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఐశ్వర్య లక్ష్మీ ఓ నటుడి గురించి చేసిన కామెట్స్ వైరల్ గా మారాయి. తమియల్ ఇండస్ట్రీలో కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా మారాడు సూరి. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించాడు. ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. విడుదల, విడుదల 2 విషయంలో సూరి నటన అందరినీ కట్టి పడేస్తుంది.

అయితే త్వరలోనే సూరి, ఐశ్వర్య లక్ష్మీ కలిసి నటించిన మామన్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. కాగా తాజాగా ఐశ్వర్య మాట్లాడుతూ.. సూరితో  ఎందుకు నటిస్తున్నావ్.? ఓకేనా.? అని అంతా అడుగుతున్నారని తెలిపింది. అలా అడిగేవారికి సమాధానం ఇస్తూ.. సూరితో నటిస్తే ఏమైంది.? అతనికేం తక్కువ..? సూరి ఇప్పుడున్న స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు, ఆయనకు స్టార్ హీరో అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయని, ఆయనతో యాక్టింగ్ ఎంతో కంఫర్ట్ గా అనిపించింది. సూరితో నటించడం నాకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

v

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.