
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అతను నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్టోర్ట్స్ డ్రామా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ చరణ్. అదే సమయంలో తన తర్వాతి సినిమా కోసం కూడా రెడీ అవుతున్నాడు. గతంలో తనతో ‘రంగస్థలం’ వంటి క్లాసిక్ హిట్ సినిమాను తెరకెక్కించిన సుకుమార్‌తోనే మళ్లీ జత కడుతున్నాడీ మెగా పవర స్టార్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. కాగా ఆర్ సీ 17( వర్కింగ్ టైటిల్) సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలకమైన పాత్ర చేయనుందని టాక్ వినిపిస్తోంది. మెయిన్ హీరోయిన్ రోల్ కాకపోయినా అందుకు సరి సమానంగా ఉండే రోల్ లో లేడీ సూపర్ స్టార్ నటించనుందని సమాచారం. సినిమాకు నయనతారే పాత్రే బ్యాక్ బోన్ అని, సుకుమార్ కూడా ఈ పాత్రను బలంగా డిజైన్ చేశారని నెట్టింట వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే మెగాస్టార్ నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ గా నటించింది నయనతార. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోనూ నయనతార నటిస్తే కచ్చితంగా ఆర్ సీ 17 కు మరింత హైప్ వస్తుది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కాగా ఆర్ సీ 17 సినిమాలో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ నటి కియారా అద్వానీని తీసుకోనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ బ్యూటీని వద్దంటున్నారు. ఎందుకంటే చరణ్ తో కలిసి కియారా నటించిన వినయ విధేయ రామ్, గేమ్ ఛేంజర్ సినిమాలు బాక్సాఫీస వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో సుకుమార్ అండ్ టీమ్ మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి