Dacoit: అడవి శేష్, శ్రుతిహాసన్ పాన్ ఇండియా మూవీ టీజర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా.!

|

Dec 20, 2023 | 4:46 PM

చివరిగా మేజర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్ రెడీ గూఢచారి 2 సినిమాను లైనప్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఈలోగ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అడవి శేష్ , శృతిహాసన కలిసి ఈ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.

Dacoit: అడవి శేష్, శ్రుతిహాసన్ పాన్ ఇండియా మూవీ టీజర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా.!
Decoit
Follow us on

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు అడవి శేష్. చివరిగా మేజర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అల్ రెడీ గూఢచారి 2 సినిమాను లైనప్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఈలోగ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అడవి శేష్ , శృతిహాసన కలిసి ఈ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ తో సినిమా పై అంచనాలను క్రియేట్ చేశారు.

తాజాగా ఈ  సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు డెకాయిట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒక ప్రేమ కథ అనే క్యాప్షన్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా టీజర్ విషయానికొస్తే..

ఈ టీజర్ లో ఓ యుద్దాన్ని చూపించారు. ఒక షూట్ అవుట్ జరిగినట్టు చూపించారు. జూలియట్ ఎన్నేళ్లు అయ్యింది మనం కలిసి అంటూ అడవి శేష్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. కలిసి కాదు విడిపోయి అంటూ శ్రుతిహాసన్ చెప్పడం.. ఈ టీజర్ లో చూపించారు. శ్రుతిహాసన్ ఓ గాన్ పట్టుకొని శేష్ కోసం వెతకడం.. అతను కనిపించగానే ఆమె గాన్ లు లోడ్ చేసి అతనికి గురి పెట్టడం చూపించారు. అలాగే శేష్ కూడా గాన్ తీసి శ్రుతిహాసన్ కు గురి పెట్టాడు. ఇద్దరూ ఓకే సారి షూట్ చేయడం తో టీజర్ ఎండ్ అయ్యింది. అయితే ఈ టీజర్ లో శేష్ తనను మోసం చేశాడు అని చెప్పింది. ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీకి శనేయిల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. న్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.