Adipurush: ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఆ రాష్ట్రాలలో ఆదిపురుష్ మూవీ టికెట్స్ ధరలు తగ్గింపు

|

Jun 22, 2023 | 12:55 PM

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీత పాత్రలో కనిపించింది. అలాగే సన్నీ సింగ్ లక్ష్మణుడిగా.. దేవ్ దత్ హనుమంతుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించారు.

Adipurush: ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఆ రాష్ట్రాలలో ఆదిపురుష్ మూవీ టికెట్స్ ధరలు తగ్గింపు
రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ ఆదిపురుష్‌ను తెరకెక్కించాడు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జూన్‌ 16న గ్రాండ్‌గా రిలీజైంది.
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రామాయణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీత పాత్రలో కనిపించింది. అలాగే సన్నీ సింగ్ లక్ష్మణుడిగా.. దేవ్ దత్ హనుమంతుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి రకరకాల వివాదాలు ఈ మూవీని చుట్టుముడుతున్నాయి. నిజానికి ఈ మువీ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే వివాదాలు చెలరేగాయి. రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నారు.

ఇక ఈ సినిమా ఇప్పటికే భారీగా వసూళ్లతో దూసుకుపోతుంది. ఐదు వందల కోట్ల వరకు వసూల్ చేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్స్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ మూవీ టికెట్స్ ధరలు తగ్గించారని తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా టికెట్స్ ధరలను తగ్గించారు చిత్రనిర్మాతలు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల ధరను భారీగా తగ్గించారు చిత్రనిర్మాతలు. త్రీడీలో సినిమా చూసేందుకు రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ..కేరళ, తమిళనాడులో రేట్లు తగ్గించలేదు.