సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటూ చాలా మంది కలలు కంటుంటారు. కొందరు అవకాశాలు అందుకొని రాణిస్తారు. మరికొందరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక వెనకబడతారు. ఇక అవకాశలకోసం స్టూడియోల చుట్టూ తిరిగే వారు పదుల సంఖ్యలో ఉంటారు. ఇదిలా ఉంటే సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాక సతమతమైన వారు ఉన్నారు. కొందరు దయనీయ స్థితిలో ఉంటే మరికొంతమంది వేరే వృత్తుల్లో బిజీ అయ్యారు. కొందరు పూటగడవక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా ఓ నటి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ వీడియోను అప్లోడ్ చేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. అసలు ఆ నటి ఎవరు..? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందంటే..
తమిళ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి విజయలక్ష్మి. ఈ అమ్మడు తెలుగులోనూ నటించింది. అర్జున్, జగపతి బాబు , వేణు కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించింది విజయలక్ష్మి. ఆ సినిమాలో అర్జున్, జగపతి బాబు చెల్లెలిగా కనిపించింది. తాజాగా ఆమె మంగళవారం రోజున ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నా అని తెలిపింది.
ఆ వీడియోలో విజయలక్ష్మి మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు నా నమస్కారం.. ఫిబ్రవరి 29న నేను ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ నాతో మాట్లాడాలని, ఆయన నాతో కలిసి జీవించాలని కోరాను.. కానీ నాకు ఎలాంటి స్పందన రాలేదు. నేను ఎంతో బాధపడ్డాను, ఏడుస్తూ అతనికి ఓ వీడియోను పంపాను. నువ్వు కావాలి.. నువ్వు లేకుంటే చచ్చిపోతా అని చెప్పను కానీ అతను పట్టించుకోలేదు. నన్ను పెళ్లి చేసుకొని సీక్రెట్ గా ఉంచి.. నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదు అని రోడ్డున పడేశాడు. నాకు ఎవ్వరూ సాయం చేయడం లేదు కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నేను కర్ణాటకలో బ్రతకలేకపోతునాన్ను. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఇదే నా చివరి వీడియో..నా చావు పై సీమాన్ వివరణ ఇవ్వాలి అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.