Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన విద్యాబాలన్

|

Mar 12, 2023 | 8:10 AM

కాస్టింగ్ కౌచ్ లో భాగంగా ఎదుర్కున్న అనుభవాల్ని మరో హీరోయిన్ కూడా బయట పెట్టారు. ఆమె ఎవరో కాదు విద్యాబాలన్.  డర్టీ పిచ్చర్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయారు విద్య

Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన విద్యాబాలన్
Vidya Balan
Follow us on

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ నోరు విప్పారు. చాలా మంది తమకు జరిగిన చేదు అందుభావాలను బయట పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులు ఒకొక్కరుగా తమకు జరిగిన విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. కాస్టింగ్ కౌచ్ లో భాగంగా ఎదుర్కున్న అనుభవాల్ని మరో హీరోయిన్ కూడా బయట పెట్టారు. ఆమె ఎవరో కాదు విద్యాబాలన్. డర్టీ పిచ్చర్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయారు విద్య. ఆ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ఎంతో బోల్డ్ గా నటించి మెప్పించింది కూడా.. అయితే తాజాగా విద్య బాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

ఓ దర్శకుడు తన పట్ల వ్యవహరించిన తీరును తెలిపారు విద్య బాలన్. పరిశ్రమకి వచ్చే ముందు ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయని చాలా మంది చెప్పారు. అందుకే ఇండస్ట్రీలోకి వెళ్తాను అంటే మా అమ్మానాన్న భయపడ్డారు.

అయితే వాళ్ళు భయపడినట్టే నాకు ఒక సంఘటన ఎదురైంది. ఓ దర్శకుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాలను చూశాడు.  ఒక సినిమా గురించి మాట్లాడటానికి ఓ కాపీ షాప్ కి వెళ్లాం. కథ మధ్యలో మనం రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందా మన్నాడు ఆ దర్శకుడు. ఆయన మాటని నమ్మి వెళ్లాను. కా అయితే అక్కడకు వెళ్లిన తర్వాత నాకు అతని ఇంటెన్షన్ అర్ధమైంది. రూమ్ కి వెళ్లిన వెంటనే ఆ గది తలుపులు తెరిచే  ఉంచాను. దీంతో అతడికి ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు అని తెలిపింది విద్య బాలన్.