తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె నటించిన లేటేస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. టీజర్, ట్రైలర్ తో మూవీపై బజ్ క్రియేట్ చేసిన మేకర్స్.. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తారల పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు ఎదురవుతుండగా.. ఎంతో స్పోర్టివ్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రేమ, పెళ్లి వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
గతంలో స్వాతిముత్యం సినిమాలో తనతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్ తో వర్ష ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక వాటిపై ఇప్పుడు వర్షా ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. ఇక తాజాగా ఊరు పేరు భైరవకోన మూవీ ప్రమోషనల్లో తన పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసింది వర్షా.
‘మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినా.. ఇద్దరం కలిసి బయట తిరిగినా ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు. ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ.. నేను ఏదైనా పోస్ట్ చేస్తే అందుకు తాను రియాక్ట్ అవ్వడం.. తన పోస్టులకు నేను రియాక్ట్ కావడం లాంటి పనులు చేస్తే అందులో అర్థం ఉంటుంది. మా మధ్యలో ఇలాంటివి ఏమి జరగకుండానే ఆ వార్తలు చూసి షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే అతను గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్స్ అంతే. కానీ మా మధ్య ఇలాంటి రూమర్ విని షాక్ అయ్యాను. ఆ తర్వాత దానికి కరెక్ట్ గా రిప్లై కూడా ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
Varsha Bollamma trashes marriage rumours with Bellamkonda Ganesh at #ooruperubhairavakona promotions #VarshaBollamma pic.twitter.com/rEezLleEaW
— Filmy Focus (@FilmyFocus) February 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.