
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్రిష ఎక్కడ ప్రచారం చేయలేదు.. డైరెక్ట్‌గా ఎవరికి మద్దతు ప్రకటించలేదు.. అయినప్పటికి త్రిష విజయ్ పార్టీ విజయంలో ప్రధాన పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు త్రిష 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు.. తమిళనాడు ఫలితాల ముందు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు త్రిష. తిరుమల దర్శనం చేసుకున్న తరువాత త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష-విజయ్ రిలేషన్ చర్చనీయాంశంగా మారింది. విజయ్ అధికారంలోకి వస్తే త్రిష పవర్ సెంటర్ అవుతారని ప్రచారం సైతం జరిగింది. అయితే.. అనూహ్యంగా విజయ్ గెలుపు.. త్రిష పుట్టినరోజు ఒకే నాడు రావడం పట్ల విజయ్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి..
సోషల్ మీడియాలో సైతం విజయ్, త్రిష హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఊహించని విధంగా విజయ్ పాగా వేయడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్-త్రిషను టార్గెట్ చేస్తూ ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ డీఎంకే , బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అయితే ఎన్నికల ఫలితాల రోజు విజయ్ ఇంటికి వచ్చి త్రిష అభినందనలు తెలపడం సంచలనం రేపింది. విజయ్ ఇంటికి త్రిష రావడంపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
ఇదిలా ఉంటే త్రిష తన అభిమాన హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. తన అభిమాన హీరో అజిత్ అని తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అజిత్ ఫోటో చూపించి ఆయన గురించి చెప్పమనగానే అతను నా అభిమాన హీరో.. అంటూ త్రిష చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దళపతి విజయ్ ఫోటో చూపించగా.. మంచి నటుడు, చార్మింగ్ పర్సన్ అంటూ తెలిపారు. ఆతర్వాత విజయ్ సేతుపతి ఫోటో చూపించగానే ఆయన కూడా తన అభిమాన నటుడు అని తెలిపారు త్రిష. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.