
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం గని. ఈ సినిమాను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. నిన్నటి నుంచి సస్పెన్‌లో పెట్టిన గని స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటిస్తూ.. ఆమెకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. గతంలో తమన్నా.. అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, జాగ్వార్, జైలవకుశ, కేజీఎఫ్, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలలో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టింది.. గని చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ పాటను జనవరి జనవరి 15న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రయూనిట్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Making each punch count. ? #Kodthe out on Jan 15th! ✨
? @MusicThaman
? @ramjowrites@IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/2NgFybE7UO— Tamannaah Bhatia (@tamannaahspeaks) January 12, 2022
Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..